పురిటినొప్పులతో ఆసత్రికి వస్తున్న మహిళ 108 వాహనంలో ప్రసవించింది.
ములుగు(వరంగల్ జిల్లా): పురిటినొప్పులతో ఆసత్రికి వస్తున్న మహిళ 108 వాహనంలో ప్రసవించింది. ఈ సంఘటన సోమవారం వరంగల్ జిల్లా ములుగు మండలంలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని మాన్‌సింగ్‌తండాకు చెందిన నూనావత్ సంగీతకు పురిటి నొప్పులు రావడంతో భర్త రాంసింగ్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
నల్లబెల్లి 108 వాహనంలో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రేమ్‌నగర్ వద్ద మహిళ ప్రసవించింది. ఆడ పిల్లకు జన్మనిచ్చిన సంగీత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. కాగా, వైద్య సేవలందించిన ఈఎంటీ రేణుక, పైలట్ అజీంపాషాను స్థానిక వైద్యులు అభినందించారు.