సాక్షి, హైదరాబాద్ : నగరంలోని డాంగోరియి ఆస్పత్రిలో అరుదైన ఘటన జరిగింది. ఓ గర్భిణికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు రెండుతలల మృత శిశువును బయటకు తీశారు. నగరానికి చెందిన ఓ మహిళ నాలుగులు నెలల గర్భం ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న స్కానింగ్ సెంటర్ లో అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌లో శిశువుకు రెండు తలలు ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా ఆ శిశువుకు చాలా జన్యుపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. రెండు తలలే కాకుండా గుండె, మెదడులో కూడా లోపాలు ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి లీల ఆధ్వర్యంలో గర్భిణికి ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. ఇది మెడికల్ హిస్టరీలో అరుదైన ఘటన అని, కోటి మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఈ లోపంతో కాకుండా చాలా లోపాలు ఉండడం వల్ల ఆ శిశువు మనుగడ సాధించడం అసాధ్యమని వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment