Baby Die
-
బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్
'జబర్దస్త్' షోతో చాలామంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకడు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) 'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది' 'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
శిశువు మృతిపై హస్పీటల్ ముందు ఆందోళన
సాక్షి, గుంటూరు ఈస్ట్ : జీజీహెచ్ ప్రసూతి వార్డులో డెలివరీ అనంతరం వైద్య సిబ్బంది మృత శిశువుని తల్లికి అప్పజెప్పడంతో బాధిత మహిళ బంధువులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల మేరకు.. గుజ్జనగుండ్లలో గోపి, నందిని దంపతులు నివసిస్తున్నారు. నందిని కాన్పు నిమిత్తం ఈ నెల 5వ తేదీ జీజీహెచ్ ప్రసూతి వార్డుకు వచ్చింది. స్కానింగ్ అనంతరం వైద్యులు ఆమెను వార్డులో చేర్చుకున్నారు. అప్పటి నుంచి వరుసగా మూడు రోజులు నందిని కడుపు నొప్పితో బాధపడింది. దీనిపై నందిని తల్లి వైద్యులను సంప్రదించగా ప్రమాదం లేదని చెబుతూ వచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నందినికి స్కానింగ్ చేయాలని వైద్యులు నిర్ధారించారు. అయితే స్కానింగ్ సాయంత్రం 5 గంటలకు చేశారు. అనంతరం అత్యవసరంగా డెలివరీ చేయడంతో మృత శిశువు ప్రసవించింది. నందిని ఆరోగ్యం విషమించడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రసూతి వార్డు వెలుపల ఆందోళనకు దిగారు. నందిని గర్భంలో శిశువు మృతి చెందడాన్ని వైద్యులు ఆల్యంగా గుర్తించారని ఆరోపించారు. రూ. 1500 తీసుకున్నారు నందిని బంధువులు ఆందోళన చేస్తుండగా.. మరో బాలింత బంధువు షేక్ జాన్‌బీ తమకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందు వివరించింది. షేక్ నజ్మా అనే గర్భిణి ఈ నెల మూడో తేదీ ప్రసూతి వార్డులో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్య సిబ్బంది తన వద్ద రూ.1500 తీసుకున్నట్లు జాన్‌బీ ఆరోపించింది. బిడ్డ వ్యర్థాలు మింగడమే కారణం శిశువు మృతి చెందడంపై ఆర్ఎంవో ఆదినారాయణ వివరణ ఇస్తూ నందిని కాన్పు ఈ నెల ఏడో తేదీగా వైద్యులు నిర్ధారించారని, కడుపులో నొప్పి కారణంగా ఆమెను ఐదో తేదీనే వార్డులో చేర్చుకున్నారని తెలిపారు. గర్భస్థ శిశువు వ్యర్థ పదార్థాలు తీసుకున్న కారణంగా లన్స్‌లోకి ప్రవేశించి మృతి చెందినట్లు వెల్లడించారు. నందిని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
ఆక్సిజన్ అందక బిడ్డ మృతి
సాక్షి, కారంపూడి : సకాలంలో వైద్యం అందక పురిటిలోనే శిశువు మృతి చెందిన ఘటన కారంపూడి పీహెచ్సీలో మంగళవారం జరిగింది. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బి.మరియకుమారి పురిటినొప్పులతో బాధపడుతుండగా మంగళవారం తెల్లవారు జామున 108లో ఆమె బంధువులు కారంపూడి పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు. అక్కడ ఆమెకు సరైన వైద్యసేవలు సకాలంలో లభించలేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన డ్యూటీ నర్స్ కాన్పు చేయించే యత్నం చేశారు. ఈ క్రమంలో మరియకుమారి పురిటి నొప్పులతో రెండు గంటల పాటు అల్లాడిపోయింది. అలా మగళవారం తెల్లవారుజాము 3.30 నుంచి ఉదయం 5.30 వరకు బాధపడుతుండగా నర్స్, ఆయాలు కాన్పు చేయించేందుకు ప్రయత్నించారు. బయటకు పంపితే తాము నిర్లక్ష్యం చేశామని, ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనతో అతికష్టం మీద కాన్పు చేశారు. అయితే కాన్పు తర్వాత బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందించే యత్నం చేశారు. తర్వాత స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే శిశువు మృతి చెందినట్లు చెప్పారు. వాస్తవంగా శిశువును పిడియాక్ట్రిక్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి. కారంపూడిలో ఆ డాక్టర్ లేరు. రాత్రి పూట వచ్చిన ఇలాంటి క్రిటికల్ కేసులు చూడటానికి డాక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీకి వచ్చిన డాక్టర్ దుర్గారావు మరియకుమారిని పరీక్షించి ఆమె ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆమె బంధువులతో ఆస్పత్రికి వచ్చి తన బిడ్డ మృతికి సరైన వైద్యసేవలు అందకపోవడమే కారణమని పీహెచ్సీ ముందు బైఠాయించింది. వాస్తవంగా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. అయినా ఇంటికి పంపారు. తర్వాత బంధువులు ఆందోళనకు దిగడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యమేనా.. డ్యూటీ నర్స్‌లు ఆస్పత్రిలో ఉండకపోవడం చాలా కాలంగా జరుగుతోంది. అలాగే క్రిటికల్ కేసులు వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో లేకుండా వేరే పట్టణాలలో ఉంటుండంతో ఈ పరిస్థితి వచ్చింది. డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే డ్యూటీ చేస్తున్నారు. వాస్తవంగా వారు స్థానికంగా అందుబాటులో ఉండి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చాడాలి. అయితే తాను డెప్యూటేషన్‌పై గుంటూరు జీజీహెచ్‌లో డ్యూటీలో ఉన్నానని వైద్యాధికారి బాలకిషోర్‌నాయక్ చెప్పారు. మరోవైపు బిడ్డ పుట్టగానే మృతి చెందిదని, ఈ విషయం తల్లికి బంధువులు తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తారోనని ఆస్పత్రి సిబ్బంది నాటకం అడినట్లు తెలుస్తోంది. బాధితులు స్థానిక ఎస్ఐ రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. -
అరుదైన ఘటన.. కోటిలో ఒకరికి మాత్రమే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని డాంగోరియి ఆస్పత్రిలో అరుదైన ఘటన జరిగింది. ఓ గర్భిణికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు రెండుతలల మృత శిశువును బయటకు తీశారు. నగరానికి చెందిన ఓ మహిళ నాలుగులు నెలల గర్భం ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న స్కానింగ్ సెంటర్ లో అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌లో శిశువుకు రెండు తలలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ శిశువుకు చాలా జన్యుపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. రెండు తలలే కాకుండా గుండె, మెదడులో కూడా లోపాలు ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి లీల ఆధ్వర్యంలో గర్భిణికి ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. ఇది మెడికల్ హిస్టరీలో అరుదైన ఘటన అని, కోటి మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఈ లోపంతో కాకుండా చాలా లోపాలు ఉండడం వల్ల ఆ శిశువు మనుగడ సాధించడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. -
వచ్చీరాని వైద్యానికి చిన్నారి బలి
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం..చంద్రగిరి కొత్తపేటకు చెందిన లోకనాథం, శాంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. లోకనాథం సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేయడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం లోకనాథం కుమార్తెలు విషిక, రిషిక(9) జ్వరం బారిన పడడంతో స్థానిక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లారు. అతను రాసిచ్చిన ప్రిస్కిప్షన్ మేరకు అతని మందుల షాపులోనే మందులు కొని తీసిచ్చారు. తొలుత విషికకు సుధాకర్ చికిత్స చేశారు. అనంతరం రిషికకు వేర్వేరు నడుం దిగువ భాగంలో ఇంజెక్షన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రిషిక కాలుకు తీవ్రంగా వాపు రావడంతో మరోసారి సుధాకర్‌ను సంప్రదించారు. ఇదేమీ కాదని వారికి ఆయన చెప్పారు. అంతేకాకుండా అతని సూచన మేరకు రిషిక కాలుకు వేడినీటితో కాపడం పెట్టారు. సోమవారం ఉదయం పాప కాలు పూర్తిగా వాచిపోవడంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తాటితోపు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వెద్యులు చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పాపకు పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు, చంద్రగిరిలో పాపకు వేసిన ఇంజెక్షన్ వలన కాలుకు ఇన్ఫెక్షన్కు గురైందని, దీనివలన శరీరంలో రక్తం పూర్తిగా గడ్డకట్టడంతో పాటు ప్రాణాపాయ స్థితికి చేరిందని వెల్లడించారు. అనంతరం చికిత్స ప్రారంభించేలోపు పాప కన్నుమూసింది. మృతదేహంతో చంద్రగిరికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి కారణమైన పీఎంపీ సుధాకర్‌ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రిషికకు అంత్యక్రియలు నిర్వహించారు. అనుమతులు లేకున్నా క్లినిక్స్ నిర్వహణ చంద్రగిరిలో అనుమతులు లేకుండా పీఎంపీలు క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధన ఉంది. అయితే కొందరు ఏకంగా మెడికల్ షాపులు సైతం అనుబంధంగా పెట్టి, ఆపరేషన్లు సైతం చేస్తుండటం గమనార్హం! మిడిమిడి జ్ఞానంతో రోగుల జీవితాలో చెలగాటమాడుతున్నారు. సుధాకర్ కూడా ఆపరేషన్లు చేసేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇతని సర్టిఫికెట్‌కి వ్యాలిడిటీ లేకపోయినా సంబం«ధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లినిక్‌కు అనుబంధంగా సుధాకర్ ఓ మెడికల్ షాపును సైతం నిర్వహిస్తున్నారు. ఇదలా ఉంచితే, సుధాకర్ రాసిచ్చిన మందుల ప్రిస్కిప్షన్‌ను మండల స్థాయి వైద్యాధికారి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది.దానిని పరిశీలించిన ఆయన అవి నాసిరకమైన లోకల్ మందులుగా ఉన్నాయని, కంపెనీవి కావని వైద్యాధికారి చెప్పారు. నిద్రావస్థలో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో కొన్నిచోట్ల పీఎంపీలు ఎలాంటి అనుమతి లేకుండా చికిత్స, ఆపరేషన్లు చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీనిపై డీఎంహెచ్ఓను వివరణ కోరగా అది తమ పరిధిలోకి రాదని, డ్రగ్స్ అధికారులు చూసుకోవాలంటూ ఫోన్ పెట్టేశారు. -
పాలిథిన్ కవర్లో పసికందు
మైలార్‌దేవ్‌పల్లి రంగారెడ్డి : పేగుబంధాన్ని మరిచారు. ఏ తల్లి కన్నబిడ్డో పాపం రోడ్డున పడేశారు. అప్పుడే పుట్టిన పసికందు పాలిథిన్ కవర్లో శవమై కనిపించింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి ప్రాంతంలో రోడ్డుపైన ఓ ప్లాస్టిక్ కవర్ పడి ఉంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్ధ్య కార్మికులు కవర్‌ను పరిశీలించి చూడగా అందులో పసికందు కనిపించింది. ప్రాణాలతో ఉంటుందని స్థానికులు చూడగా.. అప్పటికే మృతి చెందింది. శిశువు మృతదేహం గురించి స్థానికులను అడిగినా.. ప్రయోజనం లేకుండాపోయింది. శిశువును ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి ఎవరో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల సాయంతో శిశువును స్థానికంగా ఉన్న శ్మశానవాటికలో కననం చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విమానం అత్యవసర ల్యాండింగ్.. అయినా దక్కని పసివాడి ప్రాణం
హైదరాబాద్: నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో పట్నా వెళ్లే ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయినప్పటికీ ఆ పసివాడి ప్రాణం మాత్రం దక్కలేదు. బిహార్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సందీప్‌కుమార్ తన భార్య పునీత్ శర్మతో కలసి బెంగళూరులో నివాసముంటున్నాడు. మంగళవారం ఉదయం పునీత్ శర్మ తన నాలుగు నెలల కుమారుడు స్పర్శ్‌తో కలసి బెంగళూరు నుంచి ఇండిగో 6ఈ837 విమానంలో పట్నాకు బయలుదేరింది. ప్రయాణంలో స్పర్శ్ శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురికావడంతో ఆమె విమాన సిబ్బంది దృష్టికి తీసుకువచ్చింది. దీంతో పైలెట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే చిన్నారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో మృగాల కంటే దారుణంగా..
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు దుండగులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారు. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఓ బాలింతపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు దుండగుల బారి నుంచి రక్షించుకునే ప్రయత్నంలో ఆమె ఒడి నుంచి 14 రోజుల పసికందు జారిపడి మరణించాడు. రాయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలసి బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాయ్‌పూర్‌కు తిరిగి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తూ ఆమె నిద్రపోయింది. బస్ స్టాప్‌లో మిగతా ప్రయాణికులందరూ దిగిపోగా నిద్రమత్తులో ఉన్న ఆమె గమనించలేదు. బస్సులో ఒంటరిగా మిగిలిపోయిన బాలింతపై డ్రైవర్, కండెక్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. వారిని ఎదిరించే క్రమంలో బాధితురాలు తన రోజుల బిడ్డను కోల్పోయింది. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను రోడ్డుపై దించివేసి వెళ్లిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోగా.. ఆమెకు మరచిపోలేని పీడకలను మిగిల్చింది.