ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UP
pic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment