Parking Dispute
-
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
పార్కింగ్ విషయంలో గొడవ.. తండ్రీకుమారులపై కాల్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమున విహార్‌లో గురువారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తి తండ్రీకుమారులపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. 15 మంది గ్యాంగ్‌తో వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులిద్దరినీ వీరేంద్ర అగర్వాల్, శుభం అగర్వాల్‌గా గుర్తించారు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఓ కారు రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఉంది. దీంతో కారును అక్కడి నుంచి వేరే చోట పెట్టుకోవాలని, రోడ్డు బ్లాక్ అయిందని వీరేంద్ర సూచించాడు. ఈ విషయంలో కారు యజమానితో వాగ్వాదం జరిగింది. అయితే కాసేపయ్యాక కారు యజమాని 15 మందితో కలిసి వీరేంద్ర ఇంటికి వెళ్లాడు. ఈ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి వీరేంద్రతో పాటు అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం 15 మంది అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఒక్కడిని మాత్రం స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కారు యజమానిని గుర్తించామని, అతనితో పాటు మిగతా అందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమ నావలో ప్రయాణం.. సహజీవనం.. పెళ్లి ఊసెత్తితే చాలు! -
ప్రాణం తీసిన సైకిల్ పార్కింగ్
చంఢీగడ్: హర్యానాలోని పంచకుల జిల్లాలో సైకిల్ పార్కింగ్ వివాదంలో ఓ 55 ఏళ్ల వ్యక్తిని పొరుగునవారు కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే.. బైందర్ అనే వ్యక్తి ఇందిరా కాలనీలోని సెక్టార్16 లో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం తన నివాసం వెలుపల సైకిల్‌ను పార్క్ చేశాడు. వీధిలో సైకిల్‌ను పార్కింగ్ చేయడంపై బాధితుడు, అతని పొరుగు వ్యక్తి సతీశ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సతీష్ కోపంతో బైందిర్ సైకిల్ని అతడిపై విసిరాడు. అంతటితో ఆగకుండా అతనికి ఓ పాఠం నేర్పుతా అంటూ బెదిరించాడు. తర్వాత సతీశ్ తన ఇద్దరు కుమారులు విక్కీ, సన్నీ, పొరుగునే ఉన్న మహిపాల్, మోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తి, రాడ్లు, కర్రలతో బైందర్ కుటుంబంపై దాడిచేశారు. విక్కీ బైందర్‌ను ఛాతిపై కత్తితో పొడవడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బాధితుడి భార్య, ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు. ఐదుగురు నిందితులపై 302, 321, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో ఇరు పార్టీలు పలుసార్లు గొడవ పడ్డాయని పోలీసులు తెలిపారు. -
పార్కింగ్ గొడవ, రెచ్చిపోయిన రౌడీ మూక
-
ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ వర్గానికి చెందిన రౌడీ మూక మరో వర్గంపై రాళ్లు, తల్వార్లతో దాడి చేసింది. కుల్సుంపురలోని ముస్తైద్‌పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హుస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్ అలియాస్ బబ్బు, జాఫర్, మరికొంత మందితో కలిసి ఫరూక్ హుస్సేన్ ఇంటిని చుట్టుముట్టారు. బైక్‌ని ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై తల్వార్‌తో దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. ఇంట్లోని మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయితే, దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఫిర్యాదును స్వీకరించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గాయాలపాలైన ఫరూక్ హుస్సేన్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. (చదవండి: నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి) -
మందలించడమే శాపమైంది!
కామారెడ్డి క్రైం: తనను మందలించాడనే కోపంతో నిద్రిస్తున్న మామపై గొడ్డలితో అల్లుడు దాడి చేశాడు. తలపై బలంగా మోదడంతో మామ అక్కడికక్కడే చనిపోయిన సంఘటన లింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజలింగం (70)కు ఒక్కగానొక్క కుమార్తె భీమవ్వ. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇనుగుర్తి లక్ష్మణ్‌ను 30యేళ్ల క్రితం భీమవ్వతో వివాహాం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నాడు. భీమవ్వ–లక్ష్మణ్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి వారి పక్కింట్లో వివాహా విందు జరుగుతోంది. విందుకు హాజరయ్యే జనం రాజలింగం ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేశారు. లక్ష్మణ్ తన ఇంటి ముందు వాహనాలను నిలుపవద్దని వారించగా అతని భార్య భీమవ్వ అక్కడికి వచ్చింది. వాహనాల పార్కింగ్ విషయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. భార్య, కూతురుపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడకు వచ్చిన మామ రాజలింగం లక్ష్మణ్‌పై మండిపడ్డాడు. వారి మధ్య మాటలు పెరిగి వివాదం పెద్దదైంది. ఆ తర్వాత రాజలింగం ఇంటిలోకి వెళ్లి పడుకున్నాడు. మామపై ఆగ్రహంతో ఉన్న లక్ష్మణ్ గొడ్డలితో తలపై బలంగా దాడి చేశాడు. దీంతో రాజలింగం అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత లక్ష్మణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంపీగారి పిల్లల్ని వాయించారు
న్యూఢిల్లీ: పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తి ఓ బీహార్ ఎంపీ కుమారుడు, అల్లుడుని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీంతో వారిద్దరూ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలో జహనాబాద్ ఎంపీ అరుణ్ కుమార్ కుమారుడు రితురాజ్(20), అతడి మేనల్లుడు రిషాబ్(20) ఎంపీకి ఉన్న అధికార నివాసం నుంచి సౌత్ ఎక్స్టెన్షన్ అనే మరో నివాసానికి రాగా అక్కడ తమ గేట్ ముందు కొందరు వ్యక్తులు స్కూటీలు పార్క్ చేసి ఉండటం గమనించారు. ఆ స్కూటీలపై వచ్చిన వారంతా అక్కడే ఉన్న తమ బంధువులను చూసేందుకు వచ్చారు. అయితే, వాటిని తమ గేటు ముందునుంచి తీయాలని రితురాజ్ కోరగా.. మనోహర్‌లాల్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు కలిసి వారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు వచ్చిన కొందరు మహిళలను చెత్త మాటలతో దూషించారు. దీంతో రితురాజ్ భుజం దెబ్బతినగా, రిషాబ్కు పలు గాయాలయ్యాయి.