చిట్టెయ్య, మహేష్(ఫైల్)
- ఇద్దరిని మింగిన విద్యుత్ స్తంభాలు
- బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
దమ్మపేట : పేదింట పెను విషాదం.. మృత్యువు విద్యుత్ స్తంభాల రూపంలో ఆ కుటుంబాలను ఛిన్నాబిన్నం చేసింది.. దీంతో ఆ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన లకావత్ చిట్టెయ్య, దారావత్ మహేష్ బుధవారం రాత్రి వ్యవసాయ భూమిలో దుక్కి దున్నేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో నాగుపల్లి బంజార కాలనీలో విషాదాన్ని నింపింది. అదే కాలనీకి చెందిన లకావత్ చిట్టెయ్యకు ఎకరం మెరక భూమి ఉంది. అదే అతడి కుటుంబానికి జీవనాధారం. అతడికి పెళ్లీడుకొచ్చిన కూతురు, నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడే కుమారుడున్నాడు. చిట్టెయ్య తనకున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలు సాగు చేసుకుంటూ.. కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిట్టెయ్య సోదరుడు గతేడాది మొండివర్రెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇద్దరు కొడుకుల మరణంతో తండ్రి భద్రు అనాథగా మిగిలాడు.
మహేష్ నేపథ్యమిది..
నాగుపల్లికి చెందిన దారావత్ మహేష్ అవివాహితుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచే స్తూ.. తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి నాగుపల్లిలో జరిగిన దుర్ఘటనలో మహేష్ మృత్యువాతపడ్డాడు. మహేష్ మరణంతో అతడి కుటుంబం ఆధారం కోల్పోయింది. ఊరి జనంతో సరదాగా ఉండే ఇద్దరు ఒకేసారి మరణించడంతో నాగుపల్లి అంతటా విషాదం నెలకొంది.