అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్‌గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు.
ఈ థీమ్ ఉద్దేశ్యం..
వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది.
ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం.
అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్‌ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ
Comments
Please login to add a commentAdd a comment