‘బోగస్’ తేలేదెన్నడు? | ration shop dealers hold majority bogus cards | Sakshi
Sakshi News home page

‘బోగస్’ తేలేదెన్నడు?

Published Mon, Sep 1 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

ration shop dealers hold majority bogus cards

- అనర్హుల వద్ద లక్షల్లో రేషన్‌కార్డులు
- ఆధార్ సీడింగ్ 73శాతమే పూర్తి
- తేలని రచ్చబండ లబ్ధిదారుల లెక్క
- ఆధార్ గడువు మరో వారం పెంపు
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:  జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,69,451 కుటుంబాలు ఉండగా, రేషన్‌కార్డులు మాత్రం 11,73,988 ఉన్నాయి. కుటుంబాల సంఖ్యతో పోలిస్తే వివిధ కేటగిరీల్లో ఉన్న రేషన్‌కార్డుల సంఖ్యను కలుపుకుంటే 3,04,537 కార్డులు అదనంగా ఉన్నాయి. అంటే కుటుంబాల సంఖ్య 35శాతం కన్నా రేషన్‌కార్డులు అదనంగా ఉన్నాయి. జనాభా సంఖ్యతో పోల్చినా రేషన్‌కార్డుల్లో యూనిట్ల సంఖ్య కూడా అదనంగానే ఉంది. జనాభా 40,53,028 ఉండగా రేషన్‌కార్డుల్లో ఉన్న యూనిట్ల సంఖ్య 11,73,988 ఉంది.

అంటే జనాభా కంటే ఆరుశాతం మంది రేషన్‌కార్డుల్లో అదనంగా ఉన్నారు. జిల్లాలో అనర్హుల వద్ద రేషన్‌కార్డులు ఉన్నాయనేందుకు ఈ గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3,066మంది రేషన్ డీలర్ల వద్ద అదనంగా కార్డులు ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. డీలర్లు, అనర్హుల వద్ద ఉన్న రేషన్‌కార్డులను స్వచ్ఛందంగా అప్పగించాలని అధికారులు ఆదేశాలు జారీచేయడంతో డీలర్లు 3,066 కార్డులను మాత్రమే అప్పగించారు. ఇంటింటి సర్వే నిర్వహించి మరో 57,385 బోగస్‌కార్డులు ఉన్నట్లు తేల్చారు. కొన్నిచోట్ల అర్హుల వద్దే రేషన్‌కార్డులు ఉన్నా వాటిలో కుటుంబ సభ్యుల సంఖ్యను ఎక్కువగా చూపుతున్నట్లు తేలింది. రేషన్‌కార్డుల్లో వాస్తవసంఖ్య కంటే ఎక్కువగా ఉన్న 5,29,074 మంది పేర్లను కూడా జాబితా నుంచి తొలగించారు.
 
తేలని ‘రచ్చబండ’ లెక్క: రచ్చబండ కార్యక్రమంలో భా గంగా జిల్లాలో1,14,821మందిలబ్ధిదారులకు కూపన్లు జారీ చేశారు. ఇలా కార్డులు పొందిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు భావించిన అధికారులు వివరాల సేకరణకు శ్రీకారం చుట్టారు. కూపన్లు పొందిన వారు ఆధార్‌కార్డు నం బరుతో పాటు ఫొటో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి గడువు విధిస్తున్నా ఇప్పటివరకు 35,442 మంది మాత్రమే ఆధార్‌కార్డు నంబర్, ఫొటో అందజేశారు.
 
వివరాలు ఇవ్వని మరో 79,379 కార్డులకు సంబంధించి న రేషన్‌పంపిణీని ఆగస్టు నుంచి నిలిపేస్తున్నట్లు ప్రకటించా రు. ఆగస్టు 15లోగా వివరాలు ఇవ్వాలని గడువు విధించినా స్పందించకపోవడంతో సెప్టెంబర్5వ తేదీవరకుగడువు పెం చారు. మరోవైపు ఆధార్‌తో రేషన్‌కార్డులను అనుసంధానం చేస్తూ చేపట్టిన సీడింగ్ ప్రక్రియ 73 శాతం మాత్రమే పూర్తయింది.

జిల్లాలో420మీ సేవా కేంద్రాలు ఉండగా,62కేంద్రా ల్లో ఆధార్ వివరాల సేకరణకు అనుమతిచ్చారు. బోగస్ ల బ్ధిదారుల ఏరివేతకు చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ చెబుతున్నా చర్యలు నామమ్రాత్రమే. బోగస్ కార్డుల వెనుక రేషన్‌డీలర్లు, చోటామోటా రాజకీయ నాయకుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకుం టేనే మరింతమంది అనర్హులు బయటపడతారనే భావన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement