జార్జ్‌ ఫ్లాయిడ్‌ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా | Sakshi
Sakshi News home page

జార్జ్‌ ఫ్లాయిడ్‌ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా

Published Sat, Apr 27 2024 7:45 AM

Black man in usa Ohio pinned down by cops before he Deceased

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్‌ 18న చోటు చేసుకుంది.

 

వివరాలు ప్రకారం.. ఫ్రాంక్‌ టైసన్‌ ( 53) అనే వ్యక్తిని హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్‌ పోలీసులు ఓ బార్‌లో బలవంతగా పట్టుకున్నారు. బార్‌లో ఉన్న ఫ్రాంక్‌ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని  స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్‌ కేసు​లో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్‌ టైసన్ ఏప్రిల్‌ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి​ రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్‌ పోలీసుల చేతిలో ఇదే జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్‌ మరణానికి కారణమైన డెరిక్‌ చౌవిక్‌ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.

Advertisement
Advertisement