ohio police
-
జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. ఫ్రాంక్ టైసన్ ( 53) అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.NEW: 53-year-old man dies after getting taken to the ground by police and telling them that he couldn’t breathe. As Ohio man Frank Tyson was motionless on the ground, one officer could be heard bragging about the “bar fight.” Tyson had just gotten out of prison according to… pic.twitter.com/vGUTHfLHI6— Collin Rugg (@CollinRugg) April 26, 2024 -
పదేళ్ల చిన్నారి.. పోలీసులతో లెక్కలు చెప్పించింది!
పదేళ్ల వయసున్న ఓ చిన్నారి.. తనకు లెక్కలు రావట్లేదంటూ పోలీసులను సాయం చేయమని కోరింది. ఆ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పెట్టగా, ఓహియో పోలీసు అధికారి ఒకరు దానికి స్పందించారు కూడా. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సంభాషణను ఆమె తండ్రి స్క్రీన్షాట్లు తీసి ఫేస్బుక్లో పెట్టగా, అది ఒక్కసారిగా వైరల్ అయ్యింది. లీనా డ్రేపర్ (10) తనకు లెక్కలకు సంబంధించిన ఓ ప్రశ్న సమస్యగా మారిందని ఓహియో పోలీసు శాఖకు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా తెలిపింది. మీరు నాకు సాయం చేయగలరా అని కూడా కోరింది. అనుకోకుండా ఈ పోస్ట్ చూసిన ఓ అధికారి.. ఐదో తరగతి చదువుతున్న ఆ పాపకు సాయం చేయాలనుకున్నారు. (8+29) x 15 అనే సమస్యను ఎలా పరిష్కరించాలో లెఫ్టినెంట్ బీజే గ్రబర్ ఆమెకు తెలిపారు. ఆయన స్పందించడంతో లీనా ఊరుకోలేదు. (90+27) + (29+15) x 2 అనే లెక్కను ఎలా చేయాలో చెప్పమని మళ్లీ అడిగింది. ముందుగా మొదటి బ్రాకెట్లోవి కలపాలని, తర్వాత రెండో బ్రాకెట్లోవి కలపాలని, ఆ రెండింటినీ కలిపి రెండుతో గుణకారించాలని ఆయన వివరించారు. వీళ్లిద్దరి సంభాషణల స్క్రీన్ షాట్లను లీనా తండ్రి మోలీ డ్రేపర్ స్క్రీన్ షాట్లు తీసి ఫేస్బుక్లో పెట్టారు. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటున్నందుకు థాంక్స్ అని కూడా చెప్పారు. ఈ పోస్ట్‌ను మూడు వేల మంది షేర్ చేయగా, 27వేల మందికి పైగా లైక్ చేశారు.