black man
-
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. ఫ్రాంక్ టైసన్ ( 53) అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.NEW: 53-year-old man dies after getting taken to the ground by police and telling them that he couldn’t breathe. As Ohio man Frank Tyson was motionless on the ground, one officer could be heard bragging about the “bar fight.” Tyson had just gotten out of prison according to… pic.twitter.com/vGUTHfLHI6— Collin Rugg (@CollinRugg) April 26, 2024 -
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సెర్గిప్‌లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు. కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్‌ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాంటోస్‌ని పోలీస్‌స్టేషన్‌కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు. (చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్) -
ట్రంప్ నిర్వాకాలను బయటపెట్టే పుస్తకం
'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు. పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్‌తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది. (చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు) -
బైడెన్ సంచలనం: అమెరికా చరిత్రలో తొలిసారి
వాషింగ్టన్: నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్.. ట్రంప్ అధ్యక్ష కాలంలో ముదిరిన జాత్యాంహకార ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ని రక్షణ శాఖ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికన్ దళాలను పర్యవేక్షించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ని ఈ అత్యున్నత పదవికి బైడెన్ ఎన్నుకున్నారు. 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించి, యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతిగా ఎదిగారు లాయిడ్ ఆస్టిన్. తన కేబినెట్లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు పేర్కొన్నాయి. బైడెన్ శుక్రవారం ఆస్టిన్ నియామకం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్‌కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం. ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు అమెరికా ఆర్మీకి సేవలు అందించారు. 2003లో 3వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు అసిస్టెంట్ డివిజన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్టిన్ ఇరాక్‌పై దాడిలో యూఎస్ సేనలను కువైట్ నుంచి బాగ్దాద్‌లోకి నడిపించారు. 2010లో ఇరాక్‌లోని అమెరికా దళాలకు కమాండింగ్ జనరల్‌గా నియమితులైన ఆస్టిన్.. రెండేళ్ల తర్వాత మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్‌లలో పెంటగాన్ కార్యకలాపాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. 2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్లో ఒకటైన రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరారు. (చదవండి: అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్) ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌కి, ఆస్టిన్ మధ్య మంచి సంబంధాలుండేవి. ఇక వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్ సోమవారం హెల్త్ సెక్టర్‌లోకి తాను తీసుకోబోతున్న ప్రముఖ వ్యక్తుల పేర్లు వెల్లడించారు. కరోనావైరస్పై యుద్ధంలో వీరు బైడెన్‌కు బాసటగా నిలవనున్నారు. -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్‌ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!
లండన్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ఫ్లాయిడ్ మరణంతో ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు. ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్ యార్డ్ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్ ఫ్లాయిడ్‌ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు. -
అమెరికాలో మరో జాత్యహంకార ఘటన
-
కర్ఫ్యూను ధిక్కరించి..
మినియాపొలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీస్ కస్టడీలో మృతి చెందడంతో భగ్గుమన్న నిరసనలు మినియాపొలిస్ నుంచి అమెరికాలోని ఇతర నగరాలకు వ్యాపించాయి. కోవిడ్ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపొలిస్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మినియాపొలిస్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను నిరసనకారులు చుట్టుముట్టి పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రెస్టారెంట్, బ్యాంకు, మరో కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. భద్రతా కారణాల రీత్యా అగ్ని మాపక సిబ్బంది అక్కడికి రాకపోవడంతో గంటలపాటు మంటలు కొనసాగాయి. డెట్రాయిట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, అట్లాంటాలో ఆందోళనకారులు పోలీసుకార్లకు నిప్పంటించారు. న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్ నగరాల్లో భారీగా ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దొంగ నోట్ల చెలామణీకి యత్నించాడన్న ఆరోపణలపై ఫ్లాయిడ్‌ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేడీలు వేసిన తర్వాత ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్ చౌవిన్ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో, చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది. అట్లాంటాలో నినాదాలిస్తున్న ఆందోళనకారులు -
‘ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!’
వాషింగ్టన్ : ఓ నల్ల జాతీయుడి పట్ల అమానుషంగా ప్రవర్తించి అతడి చావుకు కారణమైన నలుగురు మిన్నిసోటా పోలీసులను, మేయర్ జాకబ్ ఫ్రే.. విధులనుంచి తొలిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని దారుణంగా మోకాలితో గొంతునొక్కి చంపినందుకు గానూ మంగళవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్నిసోటా, మిన్నియాపోలిస్కు చెందిన జార్జ్ ఫ్లైడ్ ఓ రెస్టారెంట్లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఓ కస్టమర్ అతడిపై ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన నలుగురు పోలీసులు అక్కడి కారులో దాక్కుని ఉన్న జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓ పోలీసు అధికారి అతడి చేతులను సంకెళ్లతో బంధించి, కారు వద్ద కిందపడేశాడు. ( పోస్టు చేయడమే పాపమైంది...) కిందపడ్డ జార్జ్ మెడపై మోకాలితో నొక్కసాగాడు. దీంతో అతడు ఊపిరాడక ‘‘ మీరు నా మెడమీద మోకాలితో గట్టిగా నొక్కుతున్నారు. నాకు ఊపిరి ఆడటం లేదు. అమ్మా! అమ్మా!’’ అంటూ విలవిల్లాడాడు. ఓ ఐదు నిమిషాల తర్వాత ప్రాణాలు విడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో ఉన్నత అధికారులు స్పందించారు. జార్జ్ చావుకు కారణమైన వారిని విధుల్లోనుంచి తొలగించారు. ( జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై) -
ఇప్పుడు భయమేస్తోంది
వాషింగ్టన్: ముందు ఎలాంటి భయం లేకపోయినా ఇప్పుడు మాత్రం తన జీవితం విషయంలో చాలా భయపడుతున్నానని అమెరికాలో ప్రధాన వార్తల్లోకి ఎక్కిన నల్లజాతియుడిపై ఓ పోలీసు అధికారి దమన చర్య వీడియోను తీసిన వ్యక్తి చెప్తున్నాడు. దక్షిణ కరోలీనాలో అకారణంగా ఓ నల్లజాతీయుడిని ప్రశ్నించి, పరుగెత్తించి మైఖెల్ శ్లాగర్ అనే అమెరికా పోలీసు అధికారి కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఫైడిన్ సాంతానా అనే వ్యక్తి తన సెల్లో చిత్రీకరించాడు. అది అనంతరం బయటకు వచ్చి కోట్లమంది చూసి ఆ పోలీసు చర్యను ఖండించారు. ప్రస్తుతం మైఖెల్ శ్లాగర్ అరెస్టు కావడమే కాకుండా అతడికి త్వరలో యావజ్జీవల లేదా ఉరిశిక్షను ఎదుర్కోనున్నారు. ఈ సందర్భంగా ఆ వీడియో తీసిన వ్యక్తిని ఓ మీడియా ప్రశ్నించగా స్పందించారు. ఆ దారుణమైన ఘటన తీసేముందు ఎన్నో భావోద్వేగాలు పుట్టుకొచ్చినా వాటిని పక్కకు పెట్టి వీడియో తీశానని.. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనలో రోజురోజుకూ భయం పెంచుతున్నాయని చెప్పారు. ఇక ఆ పోలీసు అధికారి అరెస్టు అయిన నేపథ్యంలో తనకు ఏం జరుగుతుందోనని సాంతానా మరింత ఆందోళన చెందుతున్నాడు. అతడో క్షౌరకార్మికుడిగా పనిచేస్తున్నాడు.