ఇప్పుడు భయమేస్తోంది | Fear haunts video maker of white cop killing black man | Sakshi
Sakshi News home page

ఇప్పుడు భయమేస్తోంది

Published Fri, Apr 10 2015 12:06 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

ఇప్పుడు భయమేస్తోంది - Sakshi

ఇప్పుడు భయమేస్తోంది

వాషింగ్టన్: ముందు ఎలాంటి భయం లేకపోయినా ఇప్పుడు మాత్రం తన జీవితం విషయంలో చాలా భయపడుతున్నానని అమెరికాలో ప్రధాన వార్తల్లోకి ఎక్కిన నల్లజాతియుడిపై ఓ పోలీసు అధికారి దమన చర్య వీడియోను తీసిన వ్యక్తి చెప్తున్నాడు. దక్షిణ కరోలీనాలో అకారణంగా ఓ నల్లజాతీయుడిని ప్రశ్నించి, పరుగెత్తించి మైఖెల్ శ్లాగర్ అనే అమెరికా పోలీసు అధికారి  కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఫైడిన్ సాంతానా అనే వ్యక్తి తన సెల్లో చిత్రీకరించాడు. అది అనంతరం బయటకు వచ్చి కోట్లమంది చూసి ఆ పోలీసు చర్యను ఖండించారు.

ప్రస్తుతం మైఖెల్ శ్లాగర్ అరెస్టు కావడమే కాకుండా అతడికి త్వరలో యావజ్జీవల లేదా ఉరిశిక్షను ఎదుర్కోనున్నారు. ఈ సందర్భంగా ఆ వీడియో తీసిన వ్యక్తిని ఓ మీడియా ప్రశ్నించగా స్పందించారు.  ఆ దారుణమైన ఘటన తీసేముందు ఎన్నో భావోద్వేగాలు పుట్టుకొచ్చినా వాటిని పక్కకు పెట్టి వీడియో తీశానని.. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనలో రోజురోజుకూ భయం పెంచుతున్నాయని చెప్పారు. ఇక ఆ పోలీసు అధికారి అరెస్టు అయిన నేపథ్యంలో తనకు ఏం జరుగుతుందోనని సాంతానా మరింత ఆందోళన చెందుతున్నాడు. అతడో క్షౌరకార్మికుడిగా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement