south corolina
-
ట్రంప్ హవా.. అక్కడ కూడా గెలవబోతున్నారా..!
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 24న జరిగే సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లోనూ ట్రంప్ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. అమెరికన్ ప్రామిస్,టైసన్ గ్రూపు చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్‌కు 58 శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతుండగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హాలేకు 31 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. 2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీకి ఇక్కడి ప్రైమరీలో గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. అయితే సర్వేలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే నిక్కీ పోటీలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధిస్తే మాత్రం ఇక రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్‌కు తిరుగుండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఇదీచదవండి.. గాజాలో పౌరుల మరణాలను నివారించాలి -
బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ
కొలంబియా: ఏళ్ల తరబడి సమాధానం దొరకని కేసును ఓ బుడతడు చిటికెలో పరిష్కరించాడు. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోలినాలో కొన్నేళ్ల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ఆ కేసులో చోరీ అయిన విలువైన వస్తువులు, ఆభరణాలు వేటినీ పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో అది ఎటూ తేలకుండా మిగిలిపోయింది. ఇదిలా వుండగా లాక్డౌన్ టైంలో బోర్ కొడుతోందని జాన్స్ ఐలాండ్‌కు చెందిన నాక్స్ బ్రేవర్ అనే కుర్రాడు తన కుటుంబ సభ్యులతో కలిసి మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లాడు. అంటే అయస్కాంత గాలంతో నీళ్లలో ఉన్న మెటల్ వస్తువులు వెలుగు తీయడం అన్నమాట. విట్నీ సరస్సులో గాలం వేయగా నీళ్ల అడుగు భాగాన ఓ వస్తువు గాలానికి తగిలింది. (‘ఇవి బంగారం కాదు.. నిజంగా ప్రకృతి అద్భుతం’) అది బరువుగా ఉండటంతో దాన్ని పైకి తీసేందుకు పిల్లవాడు ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో ఇతరుల సహాయం తీసుకుని ఎలాగోలా శక్తినంతా కూడదీసుకుని లాగడంతో ఓ పెట్టె బయట పడింది. అందులోని వస్తువులను చూసి అక్కడున్న వాళ్ల కళ్లు జిగేల్మన్నాయి. ఆ పెట్టె నిండా ధగధగ మెరిసే నగలు, ఖరీదైన వస్తువులు క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ ఉన్నాయి. దీంతో బుడ్డోడి తండ్రి దీని వెనక ఏదో పెద్ద కథే ఉంటుందని భావించి అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఖజానా పోగొట్టుకున్న మహిళను పిలిపించి ఆమెకు అందజేశారు. ఆమె పోగొట్టుకున్నవి ఇన్నేళ్ల తర్వాత తిరిగి దక్కడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. దీనికి కారణమైన పిల్లోడి ముందు మోకాలిపై మోకరిల్లి అతడిని మనసారా హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది. (‘బుద్ధుందా.. లాక్డౌన్లో ఇలాంటి పిచ్చి వేషాలా?’) -
ఇప్పుడు భయమేస్తోంది
వాషింగ్టన్: ముందు ఎలాంటి భయం లేకపోయినా ఇప్పుడు మాత్రం తన జీవితం విషయంలో చాలా భయపడుతున్నానని అమెరికాలో ప్రధాన వార్తల్లోకి ఎక్కిన నల్లజాతియుడిపై ఓ పోలీసు అధికారి దమన చర్య వీడియోను తీసిన వ్యక్తి చెప్తున్నాడు. దక్షిణ కరోలీనాలో అకారణంగా ఓ నల్లజాతీయుడిని ప్రశ్నించి, పరుగెత్తించి మైఖెల్ శ్లాగర్ అనే అమెరికా పోలీసు అధికారి కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఫైడిన్ సాంతానా అనే వ్యక్తి తన సెల్లో చిత్రీకరించాడు. అది అనంతరం బయటకు వచ్చి కోట్లమంది చూసి ఆ పోలీసు చర్యను ఖండించారు. ప్రస్తుతం మైఖెల్ శ్లాగర్ అరెస్టు కావడమే కాకుండా అతడికి త్వరలో యావజ్జీవల లేదా ఉరిశిక్షను ఎదుర్కోనున్నారు. ఈ సందర్భంగా ఆ వీడియో తీసిన వ్యక్తిని ఓ మీడియా ప్రశ్నించగా స్పందించారు. ఆ దారుణమైన ఘటన తీసేముందు ఎన్నో భావోద్వేగాలు పుట్టుకొచ్చినా వాటిని పక్కకు పెట్టి వీడియో తీశానని.. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనలో రోజురోజుకూ భయం పెంచుతున్నాయని చెప్పారు. ఇక ఆ పోలీసు అధికారి అరెస్టు అయిన నేపథ్యంలో తనకు ఏం జరుగుతుందోనని సాంతానా మరింత ఆందోళన చెందుతున్నాడు. అతడో క్షౌరకార్మికుడిగా పనిచేస్తున్నాడు.