వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఫిబ్రవరి 24న జరిగే సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లోనూ ట్రంప్ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. అమెరికన్ ప్రామిస్,టైసన్ గ్రూపు చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్‌కు 58 శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతుండగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హాలేకు 31 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం.
2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీకి ఇక్కడి ప్రైమరీలో గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. అయితే సర్వేలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే నిక్కీ పోటీలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధిస్తే మాత్రం ఇక రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్‌కు తిరుగుండకపోవచ్చని అంతా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment