Republican front-runner
-
ట్రంప్ హవా.. అక్కడ కూడా గెలవబోతున్నారా..!
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 24న జరిగే సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లోనూ ట్రంప్ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. అమెరికన్ ప్రామిస్,టైసన్ గ్రూపు చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్‌కు 58 శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతుండగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హాలేకు 31 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. 2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీకి ఇక్కడి ప్రైమరీలో గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. అయితే సర్వేలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే నిక్కీ పోటీలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధిస్తే మాత్రం ఇక రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్‌కు తిరుగుండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఇదీచదవండి.. గాజాలో పౌరుల మరణాలను నివారించాలి -
అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. He is a very promising candidate https://t.co/bEQU8L21nd — Elon Musk (@elonmusk) August 17, 2023 ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు. I’m breaking an unspoken rule in the GOP, but I call it like I see it: it’s deeply concerning that @elonmusk met with China’s foreign minister yesterday to oppose decoupling and referred to the U.S. & Communist China as “conjoined twins.” Tesla’s VP in China reposted that… pic.twitter.com/UD26pweilX — Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 31, 2023 ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో -
ట్రంప్ ర్యాలీలో హింస
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ర్యాలీలో హింస చెలరేగింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ గురువారం రాత్రి కాలిఫోర్నియాలోని ఓసీ ఫెయిర్, ఈవెంట్ సెంటర్లో పాల్గొన్న ఎన్నిక ప్రచారసభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకులు ఘర్షణపడ్డారు. ట్రంప్ సభకు వేలాదిమంది మద్దతుదారులు హాజరుకాగా.. వేదిక వెలుపల వీధుల్లో ఆయన వ్యతిరేకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ట్రంప్ మద్దతుదారులకు, నిరసన కారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రోడ్లను, ట్రాఫిక్‌ను బ్లాక్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నిరసన కారుల దాడిలో ఓ పోలీసు వాహనం ధ్వంసమైంది. పోలీసులు 20 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వలసలు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వారు నిరసన తెలిపారు.