Elon Musk Praises Indian-American Lawmaker Running For US President - Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడి ఎన్నికల రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ కితాబు

Published Fri, Aug 18 2023 10:57 AM | Last Updated on Fri, Aug 18 2023 12:51 PM

Elon Musk Praises Indian-American Lawmaker Running For US President - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. 

త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. 

ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. 

ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు.  

ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement