US and China
-
అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. He is a very promising candidate https://t.co/bEQU8L21nd — Elon Musk (@elonmusk) August 17, 2023 ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు. I’m breaking an unspoken rule in the GOP, but I call it like I see it: it’s deeply concerning that @elonmusk met with China’s foreign minister yesterday to oppose decoupling and referred to the U.S. & Communist China as “conjoined twins.” Tesla’s VP in China reposted that… pic.twitter.com/UD26pweilX — Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 31, 2023 ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో -
పోన్లేండి సార్.. పోలీస్‌స్టేషనే కదా!.. అధ్యక్ష భవనం కాదుగా!
పోన్లేండి సార్.. పోలీస్‌స్టేషనే కదా!.. అధ్యక్ష భవనం కాదుగా! -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
తైవాన్ జలసంధిలోకి అమెరికా యుద్ధ నౌకలు.. చైనా మండిపాటు
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన తర్వాత తైపీ, బీజింగ్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గటం లేదు. పెలోసీ పర్యటన తర్వాత తొలిసారి.. తైవాన్ జలసంధి గుండా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ప్రయాణించటం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్ఎస్ ఆంటియాటమ్, యూఎస్ఎస్ ఛాన్సలర్స్విల్లే నౌకలు సాధారణ ప్రక్రియలో భాగంగానే తైపీ జలసంధి గుండా వెళ్లినట్లు అమెరికాకు చెంది 7వ బెటాలియన్ తెలిపింది. ‘ఏ దేశ తీర ప్రాంత భూభాగానికి తాకకుండా జలసంధిలో తమ నౌకలు ప్రయాణించాయి. అమెరికా మిలిటరీ, నౌకాదళాలు.. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తిస్తాయి. ఈ నౌకల ప్రయాణం ఇండో పసిఫిక్‌లో శాంతి, సామరస్యత కోసం అమెరికా నిబద్ధతను సూచిస్తుంది.’ అని పేర్కొంది జపాన్‌లోని వాషింగ్టన్ 7న బెటాలియన్. నిశితంగా పరిశీలిస్తున్నా: చైనా తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించటాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా మిలిటరీ వెల్లడించింది. తమ బలగాలు హైఅలర్ట్‌తో ఉన్నాయని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. తగిన విధంగా స్పందిస్తామని పేర్కొంది. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
‘ఇక చాలు ఆపండి’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్ మార్షా బ్లాక్బర్న్. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం -
తైవాన్‌లో మరో కీలక నేత పర్యటన.. చైనాను అమెరికా రెచ్చగొడుతోందా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసీ పర్యటన తర్వాత తైవాన్ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్‌లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ను బయపడుతున్న ఈ తరుణంలోనే అమెరికా గవర్నర్ తైపీలో పర్యటించారు. తైపీతో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్‌లో భాగంగా ఆదివారం తైవాన్ చేరుకున్నారు అమెరికాలోని ఇండియాన రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హోల్కోంబ్. తైవాన్ అధ్యక్షుడిని సోమవారం కలిశారు. కొద్ది రోజుల క్రితం స్పీకన్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది చైనా. దాంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌కు మద్దతుగా దౌత్యపరమైన చర్యలు చేపడితే ఊరుకునేది లేదని, తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా గవర్నర్ హోల్కోంబ్తో భేటీ అయ్యారు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్. బీజింగ్ మిలిటరీ డ్రిల్స్‌పై మాట్లాడారు. తైవాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం ప్రపంచ నిరంకుశత్వ నిరంతర విస్తరణవాదాన్ని ఎదుర్కొంటున్నాం. తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి సైనిక బెదిరింపులను తైవాన్ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి అన్ని విధాల సహకారం అందించాలి.’ అని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ పేర్కొన్నారు. తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు అమెరికా గవర్నర్ హోల్కోంబ్. మరోవైపు.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లేలోపు సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో హోల్కోంబ్ భేటీ అవుతారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్! -
‘తైవాన్’పై చైనా వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న అమెరికా!
తైపీ: అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్‌లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సైన్యం చూస్తూ కూర్చోదని ఇప్పటికే హెచ్చరించింది చైనా. డ్రాగన్ హెచ్చరికలతో అప్రమత్తమైంది అమెరికా. స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఈ రీగన్ నౌక.. గైడెడ్ మిసైల్స్, యూఎస్ఎస్ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్ఎస్ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్‌డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు. చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు స్పీకర్ నాన్సీ పెలోసీ. మంగళవారం రాత్రికి తైవాన్‌లోని తైపీకి చేరుకుంటారని సమాచారం. పెలాసీ పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది అమెరికా. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్‌కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. తైవాన్‌కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చూడండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
‘అక్కడ అడుగు పెడితే ఊరుకోం’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
బీజింగ్: కరోనా, మంకీపాక్స్ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది చైనా. తాజాగా.. తైవాన్‌లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించనున్నారనే వార్తల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే.. తమ మిలిటరీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ సాదారణ సమావేశం సందర్భంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది డ్రాగన్. తైవాన్‌లో అమెరికా ప్రభుత్వం తరఫున పర్యటిస్తున్న పెలోసీ మూడో వ్యక్తిగా పేర్కొన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్. తైవాన్ తమ అంతర్గతమని స్పష్టం చేశారు. ఆసియాలోని నాలుగు దేశాల పర్యటనను సింగపూర్‌తో సోమవారం ప్రారంభించారు స్పీకర్ నాన్సీ పెలోసీ. చైనా నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోన్న తరుణంలో తైవాన్‌లో సైతం పర్యటిస్తారన్న వార్తలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
Sakshi Cartoon: చైనా సరిహద్దుల్లో అమెరికా రహస్య విమానాలు
మనం భారత్ సరిహద్దుల్లో ఇలానే చేస్తుంటే.. వాళ్లు మన సరిహద్దుల్లో అదే పని చేస్తున్నార్సార్! -
అధికార పీఠంపై తాలిబన్లు
అమెరికాపై ఉగ్రదాడి జరిగి మరో 4 రోజుల్లో రెండు దశాబ్దాలు పూర్తవుతుందనగా మంగళవారం తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజు కాబూల్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నవారిలో ఒక మహిళపై తుపాకి గురిపెట్టిన తాలిబన్ దళ సభ్యుడి చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా వైరల్ అయింది. తాలిబన్ల ఏలుబడి తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్పే ప్రతీకాత్మక చిత్రం ఇది. ఆ మరుసటి రోజే మహిళల ధర్నాను చిత్రీకరించిన టెలి విజన్ పాత్రికేయులిద్దరిని ఒళ్లంతా నుజ్జు చేసిన చిత్రాలు బయటికొచ్చాయి. తాలిబన్లతో రహ స్యంగా రెండేళ్లక్రితం చర్చలు ప్రారంభం కావడానికి చాలా ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తాలిబన్లలో మంచివారు, చెడ్డవారు ఉన్నారని, మంచివారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆయన అప్పట్లో ప్రకటించారు. తాజాగా కాబూల్‌లో కొలువుదీరిన ప్రభుత్వం అన్ని మంచి చెడ్డల్నీ గాలి కొదిలినట్టు కేబినెట్ కూర్పు చూస్తే అర్థమవుతుంది. 90వ దశకంలో అఫ్గాన్ అధికారాన్ని చేజిక్కిం చుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాదిరే ఇప్పుడు కీలకమైన పదవులన్నీ ప్రధాన తెగ అయిన పష్తూన్లకు దక్కాయి. 33 మంది కేబినెట్లో ఒక ఉప ప్రధాని పదవి ఉజ్బెక్ తెగకు చెందిన వ్యక్తికి, సైనిక దళాల ప్రధానాధికారి పదవి తజిక్ తెగ నేతకు అప్పగించారు. తక్కినవారంతా పష్తూన్లే. అమెరికా కనుసన్నల్లో మొన్నటివరకూ నడిచిన సర్కారులో కీలక పదవులు అనుభవించిన హజారా తెగకు ఈసారి మొండిచేయి చూపారు. జనాభాలో అయిదోవంతు కంటే అధికంగా ఉన్న హజారాలు షియాలు. వారికి కూడా పదవులు కట్టబెట్టాలని ఇరాన్ ఎంతగా కోరినా సున్నీలైన తాలి బన్లు బేఖాతరు చేశారు. దేశంలో హజారాలు అందరికన్నా బాగా చదువుకున్నవారు. రాజకీ యంగా చురుగ్గా పనిచేస్తున్నవారు. తాలిబన్ల పాలనకు ఇకపై వీరినుంచి సహజంగానే సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకు ప్రభుత్వంలో చోటేలేదు. ఈ సంగతలా ఉంచి అమెరికా, నాటో దళా లపై జరిగిన పలు ఉగ్ర దాడులకు కారకుడని అమెరికా బలంగా విశ్వసిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ దేశ ఆంతరంగిక భద్రతామంత్రి అయ్యాడు. ఇరవైయ్యేళ్లుగా అతన్ని అరెస్టు చేయడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే సిరాజుద్దీన్ ఆచూకీ చెప్పినవారికి భారీ నజరానా ప్రకటించింది. ఆయన్ను ఆంతరంగిక మంత్రిని చేయడం ద్వారా... ఎన్నో అవమానాల మధ్య అఫ్గాన్ నుంచి నిష్క్రమించి, పరాభవంతో కుంగిపోయివున్న అమెరికాను మరింతగా దెబ్బతీసినట్టయింది. తాలిబన్లతో చర్చిస్తున్న క్రమంనుంచి వారు అల్ కాయిదాతో సంబంధాలు వదులుకుంటామని హామీ ఇచ్చారని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ కుదరబోయే శాంతి ఒప్పందంపై తాలిబన్లు ఎప్పటికప్పుడు అల్ కాయిదాతో సంప్రదింపులు జరు పుతూనే వచ్చారు. పర్యవసానంగానే ఇప్పుడు ఆ సంస్థకు సన్నిహితుడైన సిరాజుద్దీన్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ కాకస్‌కు నేతృత్వం వహిస్తున్న కమిటీ అఫ్గాన్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాదుల చేత, ఉగ్రవాదుల కోసం ఏర్పడిన ఉగ్రవాదుల ప్రభుత్వం’గా అభివర్ణిం చింది. అయితే ఈ దుస్థితికి ప్రధానంగా తామే కారకు లమని ఆ కమిటీ గ్రహించినట్టు లేదు. ఏ సాకు చెప్పుకున్నా అఫ్గాన్ దురాక్రమణ నిర్ణయం అత్యంత దారుణమైన, అనాగరికమైన చర్య అని అమెరికా గుర్తించాల్సివుంది. ఎలాంటి పాలన అవసరమో, ఎవరు అధికార పీఠంపై ఉండాలో నిర్ణయించుకోవాల్సింది అఫ్గాన్ పౌరులే తప్ప తాము కాదన్న ఇంగితం దానికి లేకపోయింది. తాలి బన్ మత ఛాందసవాదం ఆ దేశానికే కాక, మొత్తంగా మధ్య ఆసియాకు ముప్పు కలిగించేదే. కానీ దాని పుట్టుకకూ, విస్తరణకూ, అది బలంగా వేళ్లూనుకోవడానికీ తామే కారకులమని ఇప్పటికీ అమె రికా అంగీకరించడంలేదు. దురాక్రమించినప్పటి బాధ్యతారాహిత్యాన్నే నిష్క్రమణలోనూ ప్రదర్శిం చింది. మిత్ర కూటమి నాటోకు, అఫ్గాన్ సర్కారుకు సైతం తెలియకుండా తాలిబన్లతో అంగీకారా నికొచ్చింది. ఐక్యరాజ్యసమితి మొదలుకొని ఎన్నో ప్రపంచ వేదికలుండగా, అన్ని దేశాలనూ భాగ స్తులను చేయాల్సివుండగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. మతం ఏదైనా వ్యక్తిగత విశ్వాసాల పరిధిని దాటి పబ్లిక్‌లోకి వస్తే... అధికారంతో అంటకాగితే పర్యవసానాలెలా ఉంటాయో అన్ని దేశాల్లోనూ దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. మన పొరు గున పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇంకా పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండ దేశాలు మత ఛాందస వాదం ఉగ్రరూపం చూశాయి. చూస్తున్నాయి. పశు మాంసం తింటున్నారన్న సాకుతో తోటి మనుషు లను కొట్టి చంపిన ఉదంతాలు మన దేశంలో అనేకం జరిగాయి. రిపబ్లికన్ ఏలుబడి ఉన్న అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో తాజాగా అబార్షన్లను నిషేధించి, మహిళల హక్కులను కాలరాస్తున్న వైనం వెనుక క్రైస్తవ మత ఛాందసం దాగుంది. వాటి సంగతలావుంచి అఫ్గాన్‌లో తాలిబన్ల ఏలుబడితో అరాచకానికి తెరపడినట్టయిందని చైనా పరవశిస్తోంది. పాకిస్తాన్ సరేసరి. అది తాలిబన్ ప్రభు త్వంలో ఎవరుండాలో, ఉండకూడదో నిర్దేశిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాల ప్రభా వాన్నీ తగ్గించి తాలిబన్లనుంచి ముప్పు లేకుండా చూసుకోవటం మన దేశం ముందున్న ప్రధాన సవాలు. త్వరలో తజకిస్తాన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో ఈ విషయాన్ని లేవనెత్తడంతోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. -
China-US: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా, చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఇరు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టుగా శనివారం చైనా మీడియా వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ మిలటరీ కో–ఆపరేషన్ మేజర్ జనరల్ హాంగ్ జూపింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా మిలటరీ జనరల్ మైఖేల్ చేజ్‌తో చర్చించారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని చర్చల సందర్భంగా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య అఫ్గాన్ ప్రస్తావన వచ్చినప్పటికీ అమెరికా దానిని నిర్లక్ష్యం చేసిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా, చైనా కలసికట్టుగా అఫ్గాన్ సమస్యపై దృష్టి సారిస్తే ఇరు దేశాలకు పెద్ద ప్రమాదమే తప్పిపోతుందని చైనా మిలటరీ భావిస్తోంది. ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ తిరిగి బలాన్ని పుంజుకొని విస్తరిస్తే చైనా సహా ఎన్నో దేశాలకు ప్రమాదమని, దీనిని అన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని అమెరికాను చైనా కోరినట్టుగా ఆ కథనాలు వెల్లడించాయి. చదవండి: అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు -
ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్‌డౌన్‌ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్ దిశపై ప్రభావం చూపనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్‌కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా, ఈ వారంలో ఎస్బీఐ, ఇండిగో, బీపీసీఎల్ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్డౌన్ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఏప్రిల్ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో ఫండ్స్ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. -
అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది
బీజింగ్: అమెరికా, చైనా మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుకపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఆరోపించారు. నేషనల్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (ఎన్పీసీ) వార్షిక సమావేశాల సందర్భంగా ఆదివారం వాంగ్ వీడియో ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిజాలు నిగ్గు తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా, చైనా మధ్య సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికాలో కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రెండు దేశాలను కోల్డ్ వార్ దిశగా నెట్టేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ పొలిటికల్ వైరస్ ప్రతీ దానికి చైనాను వేలెత్తి చూపిస్తోంది. చైనాను దుయ్యబట్టడానికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కొంత మంది రాజకీయ నాయకులు వాస్తవాలను చూడడానికి ఇష్టపడడం లేదు. వాస్తవాలను వక్రీకరిస్తూ మా దేశాన్ని టార్గెట్ చేస్తూ నిందలు మోపుతున్నారు. ఎన్నో కుట్రలు పన్నుతున్నారు’’అని యాంగ్ అన్నారు. కరోనా వైరస్ పుట్టుక, హాంగ్‌కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతీసేలా చైనా పార్లమెంటులో బిల్లు పెట్టడం, వాణిజ్య ఒప్పందాల రగడ, మానవహక్కులు వంటి అంశాల్లో అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాటల దాడిని పెంచిన నేపథ్యంలోనే వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తారా ? మిగిలిన దేశాల మాదిరిగానే తాము కూడా కరోనా వైరస్ బాధితులమేనన్న వాంగ్ చైనా నుంచి నష్టపరిహారాన్ని కోరుతూ అమెరికా కోర్టుల్లో దావాలు వేయడాన్ని తప్పు పట్టారు. అమెరికా తప్పుడు ఆధారాలతో బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు పొలిటికల్ వైరస్ కూడా దేశమంతా వ్యాపించిందని ఆయన విమర్శించారు. ఇది ఇరు దేశాలకు మంచిది కాదని హితవు పలికారు. కరోనా ఉమ్మడి శత్రువన్న వాంగ్ వైరస్‌పై తాము అమెరికాతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ దేశాలు విపత్తులో ఉన్న వేళ సమయాన్ని వృథా చేయకూడదని హితవు పలికారు. అమెరికా, చైనా కలసికట్టుగా తమ వ్యూహాలను పంచుకుంటూ కరోనాపై పోరాడాలని సూచించారు. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
భారీ నష్టాల నుంచి రికవరీ
ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటుపై భారం మోపుతుందనే ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ముడి చమురు ధరలు 2% మేర పెరగడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 526 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత లాభ,నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 353 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 526 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. రియల్టీ, బ్యాంక్, వాహన,ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఇంధన,లోహ,టెలికం షేర్లలో వేల్యూ బయింగ్ జరిగింది. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం మేర నష్టంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► చైనాలో గత నెలలో పారిశ్రామిక వృద్ధి పుంజుకుందన్న వార్తలతో లోహ షేర్లు లాభపడ్డాయి. -
అన్నీ మంచి శకునాలే..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈవారంలోనే.. పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. -
వాణిజ్య ఒప్పంద లాభాలు
సుదీర్ఘకాలం ప్రతిష్టంభన తరువాత అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ జోరుగా పెరిగింది. బ్రిటన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బోరిస్ జాన్సన్ పార్టీయే ఎన్నికల్లో గెలవడంతో ప్రపంచ మార్కెట్లు బాగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 41,000 పాయింట్లపైకి, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,050 పాయింట్లపైకి ఎగబాకాయి. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు బలహీనంగా ఉన్నా, ముడి చమురు ధరలు 1 శాతం మేర పెరిగినా, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం బలపడటం కొనసాగడం కలసివచ్చింది. సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 12,087 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 565 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఈ ఏడాది నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ట స్థాయికి ఎగసింది. ఈ అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి వరుసగా మూడో నెలలోనూ క్షీణించింది. ఇలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా ఈ జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 475 పాయింట్ల మేర లాభపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.5 శాతం నుంచి 2.5 శాతం మేర లాభపడ్డాయి. లోహ షేర్ల ర్యాలీ లోహ షేర్లు దుమ్ము రేపాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. ఈ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొంత కాలంగా ఈ షేర్లు నష్టపోయాయి. వేదాంత, హిందాల్కో, కోల్ ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నాల్కో, ఎన్ఎమ్డీసీ, హిందుస్తాన్ జింక్‌లు 0.2 శాతం నుంచి 3.6 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ► యాక్సిస్ బ్యాంక్ షేర్4.1 శాతం లాభంతో రూ.752 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► భారతీ ఎయిర్టెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యునిలివర్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి. ► ఇంగ్లాండ్, ఇతర యూరప్ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి, టీసీఎస్ తదితర షేర్లు లాభపడ్డాయి. లాభాలు ఎందుకంటే.. 1 అమెరికా–చైనాల మధ్య కుదిరిన డీల్ అమెరికా–చైనాల మధ్య దాదాపు 17 నెలలుగా సాగుతున్న వాణిజ్య యుద్ధం ఇక ముగిసినట్లే .వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు సంబంధించి తొలి దశ ఒప్పందం దాదాపు ఖరారైంది. దీంతో ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్న ప్రతిపాదిత సుంకాలు రద్దవుతాయి. అంతే కాకుండా ప్రస్తుతం చైనాపై విధిస్తున్న సుంకాలు 50% మేర తగ్గుతాయి. తాజా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2 బోరిస్ జాన్సన్‌కు మెజారిటీ ఇంగ్లాండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి భారీ మెజారిటీ దక్కింది. దీంతో మూడున్నరేళ్ల బ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) అనిశ్చితికి తెరపడనున్నది. వచ్చే నెల చివరికల్లా బ్రెగ్జిట్ పూర్తవుతుందని అంచనా. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ లాగానే యూరోపియన్ కేంద్ర బ్యాంక్‌కు రేట్లను పెంచకపోవడం కలిసొచ్చింది. 3. మరిన్ని తాయిలాలు... ఆర్థిక మందగమనంతో కుదేలైన ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని తాయిలాలను కేంద్రం ప్రకటించగలదన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. 4. ఇతర కారణాలు... ఎస్సార్ స్టీల్ దివాలా కేసుకు సంబంధించిన నిధులు అందే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఈ కంపెనీకి రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఎఫ్‌పీఐ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే పరిమితిని కనీసం 10% మేర పెంచాలని కేంద్రం యోచిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్
అమెరికా–చైనాల మధ్య ఈ ఏడాది చివరికల్లా వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న వార్తలతో స్టాక్ సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ద్రవ్యలోటును పూడ్చటానికి గాను డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం తాజా ప్రకటనలు, ఈ వారంలోనే నవంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కలసివచ్చాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. నిఫ్టీ 12,050 పాయింట్ల పైకిఎగబాకింది. సెన్సెక్స్‌లో కొత్తగా నాలుగు షేర్లు జత కానుండటం, ఆర్బీఐ రేట్ల కోత ఆశలు బలం పుంజుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 573 పాయింట్ల లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,932 పాయింట్లను తాకింది. చివరకు 530 పాయింట్ల లాభంతో 40,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 12,074 పాయింట్ల వద్దకు చేరింది. ఆల్‌టైమ్ హై (12,103 పాయింట్ల)కు 29 పాయింట్ల దూరంలోనే ఉంది. రోజంతా లాభాలు... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతంతమాత్రంగానే ఉన్నా, ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగినా మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 170 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, ఆవాస్ ఫైనాన్షియర్స్, ఫోనిక్స్ మిల్స్, ఓరియంట్ ఎలక్ట్రిక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. లోహ షేర్ల జోరు... అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశాలుండటం, ఉక్కు ధరలను యూఎస్ స్టీల్, ఆర్సెలర్ మిట్టల్ కంపెనీలు ఈ నెలలో మూడు సార్లు పెంచడంతో లోహ షేర్లు ముఖ్యంగా స్టీల్ షేర్లు దూసుకుపోయాయి. టాటా స్టీల్ 5%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 7% పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం ఎగసింది. మరిన్ని విశేషాలు... - సెన్సెక్స్ పునర్వ్యస్థీకరణలో భాగంగా యెస్ బ్యాంక్ షేర్‌ను తొలగించడంతో ఈ షేర్ 2 శాతం నష్టంతో రూ.63.70 వద్ద ముగిసింది. - స్పెక్ట్రమ్ చార్జీల చెల్లింపుల్లో ఊరట లభించడం, టారిఫ్‌ల పెంపునకు సంబంధించి కేంద్రం సానుకూలంగా ఉండటం, ఏజీఆర్‌పై వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు పిటిషన్ దాఖలు చేయడం తదితర పరిణామాలతో టెలికం షేర్లు జోరుగా పెరిగాయి. ఎయిర్టెల్ షేర్ 7.2 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. వొడాఫోన్ ఐడియా షేర్ 4.2 శాతం లాభంతో రూ.6.84 కు చేరింది. - 31 సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్, ఓఎన్జీసీ మినహా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. లాభాలు ఎందుకంటే... త్వరలోనే వాణిజ్య ఒప్పందం ! గత వారాంతంలో అమెరికా–చైనాల ఉన్నతాధికారులు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరగలవన్న ఆశలు మొలకెత్తాయి. మరోవైపు అమెరికా లేవనెత్తిన మేధోపర హక్కుల ఉల్లంఘనలపై జరిమానాలు విధించడానికి చైనా అంగీకరించిందన్న వార్తలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు జోరుగా పెరిగాయి. డిజిన్వెస్ట్‌మెంట్ జోరు.... ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని తట్టుకోవడానికి, ద్రవ్యలోటును పూడ్చటానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్కార్–ఈ మూడు సంస్థల్లో ప్రభుత్వానికున్న పూర్తి వాటాను విక్రయించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాను 51 శాతం కంటే తక్కువకు తగ్గించడానికి కూడా నిర్ణయం తీసుకుంది. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు... రేట్ల తగ్గింపునకు అమెరికా ఫెడ్ సానుకూలం గా ఉండటంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. కాగా ఈ నెలలో మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు.... గతంలో ఏవో కొన్ని రంగాల షేర్లు మాత్రమే పెరిగేవి. కానీ సోమవారం నాడు అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఇతర వినియోగ ఆధారిత రంగ షేర్లు జోరుగా పెరిగాయి. సాంకేతిక కారణాలు.... నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్ల ఎగువకు దూసుకుపోవడంతో కొనుగోళ్లు పోటెత్తాయని ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ సూచీ ‘డెయిలీ అప్పర్ బొలింగర్ బాండ్’ను చేరిందని, ఆల్ టైమ్ హై, 12,103 పాయింట్లకు సమీపంలోకి వచ్చిందని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా టెక్నికల్ ఎనలిస్ట్ గౌరవ్ రత్నపర్కి పేర్కొన్నారు. -
పసిడి... దీర్ఘకాలంలో పటిష్టమే!
ప్రస్తుతానికి కొంత బలహీనంగా కనబడుతున్నా... దీర్ఘకాలంలో పసిడి ధర పటిష్టంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది. అటు తర్వాత ప్రస్తుతం 100 డాలర్ల దిగువన 1,466 డాలర్లు–1,456 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 1,470 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా దాదాపు 15 డాలర్లు పెరిగింది. అయితే ప్రస్తుత శ్రేణి పసిడికి పటిష్టమైనదన్నది నిపుణుల విశ్లేషణ. లాభాల స్వీకరణే...: తాజా దిద్దుబాటు భారీగా పెరిగిన ధర నుంచి లాభాల స్వీకరణే తప్ప, పసిడి బులిష్ ధోరణిని కోల్పోలేదన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. ఈ స్థాయి నుంచి ఏ మేరకు పతనమైనా అది కొనుగోళ్లకు అవకాశమే తప్ప, ఏడాది కనిష్ట స్థాయిలను ఇప్పట్లో పసిడి చూసే అవకాశం లేదన్నది ఈ విభాగంలో నిపుణుల అభిప్రాయం. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సమసిపోతున్నట్లు వార్తలు వస్తున్నా... అది వాస్తవ రూపం దాల్చడంపై ఇప్పటికీ పలు సందేహాలు ఉన్నాయి. ఇక హాంకాంగ్ ఉద్రిక్తతలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఇవన్నీ దీర్ఘకాలంలో పసిడి మరోసారి 1,566 డాలర్ల స్థాయికి చేరడానికి వీలు కల్పించే అంశాలేనన్నది అంచనా. అయితే ప్రస్తుత శ్రేణి మద్దతు కోల్పోతే, సమీప రోజుల్లో 1,425 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. సీజనల్‌వారీగా ఈ కాలంలో పసిడి ధర కొంత తగ్గుతుండడమే దీనికి నేపథ్యం. ‘‘దీర్ఘకాలంలో పసిడి పటిష్టంగానే ఉంటుందన్నది మా అభిప్రాయం. పసిడిని కొనడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగానే ఉన్నారని మాకు సమాచారం ఉంది. అయితే స్వల్పకాలికంగా అమెరికా–చైనా చర్చలపై వారు దృష్టి సారించారు. పసిడి 1,450 డాలర్ల వైపు కదిలితే అది కొనుగోళ్లకు చక్కటి అవకాశం. 2020లో సగటున ధర 1536 డాలర్లుగా ఉంటుందన్నది మా అంచనా’’ అని స్టాండెర్డ్ చార్టర్డ్ ప్రీసియస్ మెటల్స్ విశ్లేషకులు– సుకీ కూపర్ తెలిపారు. -
క్యూ2 ఫలితాలే దిక్సూచి..!
ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, అంబుజా, తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. పాక్షిక ఒప్పందం.... గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది. నేడు రిటైల్ గణాంకాలు నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) ఎగుమతుల గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1–4న జరిగిన ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమావేశ వివరాలు (మినిట్స్) 18న(శుక్రవారం) వెల్లడవుతాయి. ఒడిదుడుకులు... ఫలితాల సీజన్ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎప్సీ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, పీవీఆర్, ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిమీత్ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్ రీసెర్చ్ ఎనలిస్ట్ ముస్తఫా నదీమ్ అంచనా వేస్తున్నారు.ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి. 6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,955 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభు త్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు. -
సెన్సెక్స్ 337 పాయింట్లు అప్
వాహన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఒప్పందం కుదరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్యాకేజీలను ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 71.68 వద్ద ముగియడం... రూపాయి వరుసగా మూడో రోజూ బలపడటం కలసివచ్చింది. ...బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 10,946 పాయింట్ల వద్ద ముగిశాయి. గణేశ్ చవితి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు చొప్పున తగ్గాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ గురువారం అభయం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహన షేర్ల లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మారుతీ సుజుకీ 3.6 శాతం, బజాజ్ ఆటో 2.9 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.1 శాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.09 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,28,104కు పెరిగింది. ► ప్రభాత్ డైరీ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నుంచి ఈ షేర్‌ను డీలిస్ట్ చేయడం కోసం ప్రమోటర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు దీనికి కారణం. 70కి పైగా ఏడాది కనిష్టం... స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినా, దాదాపు 70కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాక్స్ అండ్ కింగ్స్, అలోక్ ఇండస్ట్రీస్, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్, ఆర్‌కామ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు అబాట్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ వంటి పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. -
బడ్జెట్‌పైనే మార్కెట్ దృష్టి
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ సర్కార్.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. ఈ ప్రధాన అంశమే మార్కెట్ వర్గాలకు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నందున బడ్జెట్లో ఈసారి ద్రవ్య లభ్యత పెంపు, భారీ సంస్కరణల సూచనలు ఉండేందుకు ఆస్కారం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదించిన డిమాండ్ మళ్లీ ఊపందుకునేలా చూడడం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ బడ్జెట్లో ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన.. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, ఇంధన, విద్యుత్, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు వెల్లడైతే మాత్రం మార్కెట్‌కు నూతన ఉత్సాహం వస్తుంది. గతంలో కూడా.. మూలధన వ్యయంపై ప్రకటనలు, విధాన సంస్కరణలే సూచీల దిశానిర్దేశం చేశాయి’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మ¯Œ డీకే అగర్వాల్ అన్నారు. నిరాశపరిస్తే నేలచూపులే.. ఈవారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్.. భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంచేయనుంది. భారీ అంచనాలు ఉన్న కారణంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలోనే ఉండడం ఉత్తమం అని సూచించారు. మార్కెట్ ప్రస్తుత గమనం చూస్తుంటే తుపానుకు ముందు ప్రశాంతతలా ఉందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి భారీస్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆటోరంగంలో ఉంటే భారీ పతనం కానీ.. లేదంటే.. కోలుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. ఆటో, మెటల్ రంగాలు ఈవారం ఫోకస్లో ఉండనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఈవారంలో బడ్జెట్, 2018–19 ఆర్థిక సంవత్సర ఎకనామిక్ సర్వే (జూలై 4న) ఉన్న కారణంగా.. ప్రస్తుతం కన్సాలిడేషన్ లో ఉన్న మార్కెట్ ఈ ప్రధాన అంశాలు పూర్తయిన తరువాత బలమైన ర్యాలీ నమోదుచేయవచ్చని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఆశాజనకం.. మార్కెట్ వర్గాలను ఇరకాటంలో పడేసిన వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అమెరికా–చైనాల మధ్య ట్రేడ్వార్కు ప్రస్తుతానికి తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు అంగీకరించారు. జపాన్ లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ , ట్రంప్‌ల మధ్య ఆదివారం చరిత్రాత్మక భేటీ జరగడం కూడా మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ తాజా అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ జూన్ నెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వస్తుంది. మౌలికరంగ డేటా శుక్రవారం మార్కెట్ ముగిశాక వెల్లడికానుండగా.. జూలై ఒకటి నుంచి గతనెల ఆటో రంగ అమ్మకాల సమాచారం వెల్లడికానుంది. మరోవైపు అంతర్జాతీయ అంశాల్లో.. ఈవారంలోనే అమెరికా, చైనా దేశాల తయారీ రంగ సమాచారం వెల్లడికానుంది. రూ.10,384 కోట్ల విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాల కారణంగా వీరు వరుసగా ఐదో నెల్లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. జూన్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.2,273 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.8,112 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా గత నెలలో రూ.10,384 కోట్లను పెట్టుబడిపెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.87,313 కోట్లను వీరు పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
ట్రేడ్ వార్ : హువావే స్పందన
చైనీస్ టెలికం దిగ్గజం హువే టెక్నాలజీస్‌పై విధించిన ఆంక్షలపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ ధీటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందనీ, ఇది తగదని గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి చర్యల ద్వారా తమ సామర్ధ్యాలను ఏమాత్రం దెబ్బతీయలేరంటూ చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో పేర్కొన్నారు. హువావేపై నిషేధం సడలింపు హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా హువావేపై అమెరికా గుర్రుగా ఉన్న నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా గత వారం హువేను వాషింగ్టన్ ప్రభుత్వం వాణిజ్యపరమైన(ట్రేడ్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో గూగుల్ తదితర కంపెనీలు బిజినెస్ డీలింగ్స్‌ను రద్దుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సడలిస్తూ వాషింగ్టన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. -
అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకం
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా ఉత్పత్తులపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు చైనా దీటుగా స్పందించింది. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకు పన్ను విధిస్తామని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడులకు తలొగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. గత వారం రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ వెంటనే అమెరికా ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్ను శాతాన్ని ప్రస్తుతమున్న 10 నుంచి 25కు పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, మరో రూ.21 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపైనా ఇలాగే పన్ను భారం మోపుతామని హెచ్చరించింది. అమెరికా చర్యకు బదులు తీర్చుకునేలా చైనా దాదాపు రూ.4.2 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై 10% మొదలు కొని 25% వరకు పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో స్పం దించారు. ‘మాపై ప్రతీకారం తీర్చుకుంటే చైనా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఆ దేశంతో ఎవరూ వ్యాపారం చేయరు. చాలా కంపెనీలు ఆ దేశం వీడి మరో దేశానికి వెళ్తాయి. మాతో వెంటనే ఒప్పందానికి రావడం మంచిదని జిన్‌పింగ్‌తోపాటు చైనాలోని మిత్రులకు చెబుతున్నా’ అంటూ పేర్కొన్నారు. -
ఒడిదుడుకుల ప్రయాణం..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజ ఫలితాల వెల్లడి ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్ ఆ¯Œ క్వార్టర్ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్స (బుధవారం), ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ (గురువారం).. లార్సెన్ అండ్ టుబ్రో, వోల్టాస్ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ మనీష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి. దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్ నికాయ్ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది. వెనక్కు తగ్గిన ఎఫ్ఐఐలు గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.367 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు జి.విజయ్ కుమార్ అన్నారు.