
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన తర్వాత తైపీ, బీజింగ్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గటం లేదు. పెలోసీ పర్యటన తర్వాత తొలిసారి.. తైవాన్ జలసంధి గుండా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ప్రయాణించటం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్‌ఎస్ ఆంటియాటమ్, యూఎస్‌ఎస్ ఛాన్సలర్స్‌విల్లే నౌకలు సాధారణ ప్రక్రియలో భాగంగానే తైపీ జలసంధి గుండా వెళ్లినట్లు అమెరికాకు చెంది 7వ బెటాలియన్ తెలిపింది.
‘ఏ దేశ తీర ప్రాంత భూభాగానికి తాకకుండా జలసంధిలో తమ నౌకలు ప్రయాణించాయి. అమెరికా మిలిటరీ, నౌకాదళాలు.. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తిస్తాయి. ఈ నౌకల ప్రయాణం ఇండో పసిఫిక్‌లో శాంతి, సామరస్యత కోసం అమెరికా నిబద్ధతను సూచిస్తుంది.’ అని పేర్కొంది జపాన్‌లోని వాషింగ్టన్ 7న బెటాలియన్.
నిశితంగా పరిశీలిస్తున్నా: చైనా
తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించటాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా మిలిటరీ వెల్లడించింది. తమ బలగాలు హైఅలర్ట్‌తో ఉన్నాయని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. తగిన విధంగా స్పందిస్తామని పేర్కొంది.
ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో?
Comments
Please login to add a commentAdd a comment