బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా, చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఇరు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టుగా శనివారం చైనా మీడియా వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ మిలటరీ కో–ఆపరేషన్ మేజర్ జనరల్ హాంగ్ జూపింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా మిలటరీ జనరల్ మైఖేల్ చేజ్‌తో చర్చించారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు
అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని చర్చల సందర్భంగా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య అఫ్గాన్ ప్రస్తావన వచ్చినప్పటికీ అమెరికా దానిని నిర్లక్ష్యం చేసిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా, చైనా కలసికట్టుగా అఫ్గాన్ సమస్యపై దృష్టి సారిస్తే ఇరు దేశాలకు పెద్ద ప్రమాదమే తప్పిపోతుందని చైనా మిలటరీ భావిస్తోంది. ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ తిరిగి బలాన్ని పుంజుకొని విస్తరిస్తే చైనా సహా ఎన్నో దేశాలకు ప్రమాదమని, దీనిని అన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని అమెరికాను చైనా కోరినట్టుగా ఆ కథనాలు వెల్లడించాయి. చదవండి: అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
Comments
Please login to add a commentAdd a comment