న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.
ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎందుకంటే.. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ట్రంప్‌కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్ దొరికితే.. ఆయనపై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్ ట్రంప్ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!.
Comments
Please login to add a commentAdd a comment