‘ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!’ | Four Minnesota Police Fired From Jobs After Assassination Of Black Man | Sakshi
Sakshi News home page

నల్ల జాతీయుడిపై పోలీసుల అమానుష వైఖరి

Published Wed, May 27 2020 12:15 PM | Last Updated on Wed, May 27 2020 1:27 PM

Four Minnesota Police Fired From Jobs After Assassination Of Black Man - Sakshi

వాషింగ్టన్‌ : ఓ నల్ల జాతీయుడి పట్ల అమానుషంగా ప్రవర్తించి అతడి చావుకు కారణమైన నలుగురు మిన్నిసోటా పోలీసులను, మేయర్‌ జాకబ్‌ ఫ్రే.. విధులనుంచి తొలిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని దారుణంగా మోకాలితో గొంతునొక్కి చంపినందుకు గానూ మంగళవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..  మిన్నిసోటా, మిన్నియాపోలిస్‌కు చెందిన జార్జ్‌ ఫ్లైడ్‌ ఓ రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఓ కస్టమర్‌ అతడిపై ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన నలుగురు పోలీసులు అక్కడి కారులో దాక్కుని ఉన్న జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓ పోలీసు అధికారి అతడి చేతులను సంకెళ్లతో బంధించి,  కారు వద్ద కిందపడేశాడు. ( పోస్టు చేయడమే పాపమైంది...)

కిందపడ్డ జార్జ్‌ మెడపై మోకాలితో నొక్కసాగాడు. దీంతో అతడు‌ ఊపిరాడక ‘‘ మీరు నా మెడమీద మోకాలితో గట్టిగా నొక్కుతున్నారు. నాకు ఊపిరి ఆడటం లేదు. అమ్మా! అమ్మా!’’ అంటూ విలవిల్లాడాడు. ఓ ఐదు నిమిషాల తర్వాత ప్రాణాలు విడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో ఉన్నత అధికారులు స్పందించారు. జార్జ్‌ చావుకు కారణమైన వారిని విధుల్లోనుంచి తొలగించారు. ( జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement