రష్యా ఆర్థిక మంత్రి చిక్కుల్లో పడ్డాడు. ఓ ఆయిల్ కంపెనీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతికి పాల్పడ్డాడని తేల్చిన విచారణ కమిటీ అదుపులోకి తీసుకుంది. రష్యా ఆర్థికమంత్రిగా అలెక్సీ ఉల్యుకేవ్ పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్ మరో కంపెనీ బాష్ నెట్ ను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చేందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై రష్యా విచారణ సంస్థ దర్యాప్తు చేసి ఆయనను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది.