
హైదరాబాద్ : ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ మహమ్మద్, సయ్యద్ సలీమ్, సోనా బేగం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గ్రేటర్ కమ్యూనిటీలోని తాళం వేసిన ఇళ్లను ఈ ముఠా టార్గెట్ చేస్తుందని, ఇంటి నిర్మాణాన్ని, పరిసరాలపై నిఘా వేస్తుందని పేర్కొన్నారు.
స్కూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, గ్రిల్ కట్టర్‌ల సాయంతో ఇంటి వెనక నుంచి, ఎవరికి అనుమానం రాకుండా లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడుతున్నారని అంజనీ కుమార్ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 35 ఇళ్లలో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దొంగిలించిన సొమ్ముతో 2016లో దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారని విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యుల నుంచి 1.65 కిలోల బంగారం, 80 తులాల వెండి, 5 ల్యాప్‌టాప్‌లు, హోండా కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 70 లక్షలకు పైగానే ఉంటుందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment