
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శ్రీనగర్ : సైనిక అధికారి మహిళతో కలిసి ఓ హోటల్‌లో జమ్మూ కశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డారు. గత ఏడాది కశ్మీర్‌లో రాళ్ల దాడి ఘటనల నేపథ్యంలో ఓ యువకుడిని తన వాహన బానెట్‌పై లాక్కెళ్లిన సైనిక అధికారిగా ఆయనను గుర్తించారు. శ్రీనగర్‌లోని హోటల్ గ్రాండ్ మమతా నిర్వాహకుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. హోటల్ ప్రతినిధులు అందించిన వివరాలతో పోలీసు బృందం హోటల్‌కు చేరుకుని సైనికాధికారిని అదుపులోకి తీసుకుంది.
సైనికాధికారిని కలుసుకునేందుకు మహిళ హోటల్‌కు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసుకున్న అనంతరం సైనికాధికారిని ఆయన యూనిట్‌కు అప్పగించామని, మహిళ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా శ్రీనగర్ ఎస్‌పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంచే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఐజీ ఎస్‌పీ పాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment