నెల్లూరు(నవాబుపేట) : ఓ యువతిని నిర్బంధించిన వ్యక్తి ఆమెను చిత్రహింసలు పెట్టి బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(17)కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె తన పెదనాన్న వద్ద ఉంటూ ఆత్మకూరులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
అదే ప్రాంతానికి చెందిన షేక్ బాషా, మస్తానమ్మ కుమారుడు షఫీ వివాహితుడు. అయితే కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీ నుంచి ఆమె అదృశ్యమైంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ రోజు నుంచి ఆమెను షఫీ తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు. ఈ క్రమంలోనే ఆమె బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పురుగుల మందు తాగి పడిపోయింది.
అయితే షఫీ నెల్లూరులోని తన స్నేహితుడికి ఈ విషయం చెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని సూచిం చాడు. షఫీ స్నేహితుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు నెల్లూరుకు చేరుకుని ఆమె పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు. షఫీతో పాటు అతడి తల్లిదండ్రులు, అన్నా, వదిన తమ బిడ్డను చిత్రహింసలు పెట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జుట్టును కొంత భాగం కత్తిరించడంతో పాటు చిత్రహింసలు పెట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
యువతిని నిర్బంధించి చిత్రహింసలు
Published Mon, Oct 13 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement