పదిమంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చండీగఢ్: పదిమంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత శుక్రవారం చండీగఢ్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చిన సందర్భంగా వారంతా నల్ల జెండాలు ప్రదర్శించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, ప్రధాని వ్యతిరేక నినాదాలు చేశారని తెలిసింది.
ఈ శుక్రవారం మోదీ చండీగఢ్ పర్యనకు వెళుతున్న నేపథ్యంలో తిరిగి వారు అలాంటి ఆందోళనే చేస్తారేమోనని పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఈరోజు ప్రధాని ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రిషికేశ్ లోని స్వామి దయానంద సరస్వతీ ఆశ్రమాన్ని కూడా సందర్శించనున్నారు.