ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు! | Was Asked To Go Before PM Came, says Chandigarh Rock Garden Creators Son | Sakshi
Sakshi News home page

ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు!

Published Mon, Jan 25 2016 11:06 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు! - Sakshi

ప్రధాని రాకముందే నన్ను వెళ్లగొట్టారు!

చండీగఢ్‌: 'రాక్‌ గార్డెన్‌ లోపల నేను నిలబడి ఉన్నాను. మరికాసేపట్లో ప్రధానమంత్రి  రాక్‌ గార్డెన్‌లోకి ఫ్రెంచ్ అధ్యక్షుడిని ఆహ్వానించాల్సి ఉంది. నా దగ్గర సరైన అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ప్రధాని మోదీ రావడానికి పది నిమిషాల ముందే నన్ను అక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారు. నేను అక్కడ ఉండటానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్తూ ప్రధాని భద్రతా అధికారి ఏఐజీ బల్వాన్ సింగ్ నన్ను పంపించేశారు' అని అంజుసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చండీగఢ్‌లోని ప్రఖ్యాత 'రాక్‌ గార్డెన్‌' సృష్టికర్త నెక్‌ చంద్‌ తనయుడు ఆయన.

ఆదివారం ప్రధాని రావడానికి ముందే తనను 'రాక్‌ గార్డెన్‌' నుంచి పంపించివేయడం తీవ్ర అవమానకరమని, చండీగఢ్ అధికారులు తనకు అనుమతి ఇచ్చినా ఈ విధంగా వ్యవహరించడం.. తనను బయటకు గెంటివేయడమేనని, దీనిని తనకు తీవ్ర అవమానకరమని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు. చండీగఢ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన రాక్‌ గార్డెన్‌ను 1976లో నెక్‌చంద్‌ సైనీ నిర్మించారు. శిల్పి అయిన ఆయన గత ఏడాది మరణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత మనీష్ తివారీ ట్విట్టర్‌లో స్పందించారు. రాక్‌ గార్డెన్‌లో మోదీ, హోలాండ్‌ ఆనందంగా విహరిస్తుంటే.. రాక్ గార్డెన్ సృష్టికర్త అయిన నెక్‌ చంద్‌ కొడుకు పట్ల దారుణంగా వ్యవహరించి బయటకు గెంటేశారని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement