పోలీసుల అదుపులో హార్థిక్ పటేల్ | Patel quota agitation leader Hardik Patel detained by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో హార్థిక్ పటేల్

Published Sun, Oct 18 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

పోలీసుల అదుపులో హార్థిక్ పటేల్

పోలీసుల అదుపులో హార్థిక్ పటేల్

రాజ్కోట్: పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్కోట్-జామ్ నగర్ జాతీయ రహదారిపై అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాజ్కోట్లో 1.30 గంటలకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసింది.

ఈ మ్యాచ్ను అడ్డుకుంటామని ముందుగానే పటేల్ ఉద్యమకారులు హెచ్చరించారు. అందులో భాగంగా హార్థిక్ పటేల్ ఆందోళనకారుల సమూహంతో స్టేడియంవైపు బయలు దేరినట్లు సమాచారం. అందుకే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాజ్ కోట్ లో జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే మ్చాచ్ కు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement