పెళ్లి పీటలెక్కనున్న స్టార్‌ కమెడియన్‌ | Kapil Sharma Confirms His Marriage With Girlfriend Ginni Chatrath | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న స్టార్‌ కమెడియన్‌

Published Mon, Oct 22 2018 8:30 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

Kapil Sharma Confirms His Marriage With Girlfriend Ginni Chatrath - Sakshi

గర్ల్‌ ఫ్రెండ్‌ గిన్ని ఛత్రాత్‌ను పెళ్లాడానున్న కపిల్‌ శర్మ

స్టార్‌ కమెడియన్‌, నటుడు, నిర్మాత కపిల్‌ శర్మ పెళ్లి తేదిని ప్రకటించాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 12న తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్‌ను వివాహం చేసుకొబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం డిసెంబర్‌ 14న ముంబైలో బాలీవుడ్‌ ప్రముఖుల కోసం రిసెప్షన్‌ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. వివాహ వేడుక మాత్రం గిన్ని స్వంత ఊరైన జలంధర్‌లో జరగనున్నట్లు వెల్లడించాడు.

ఈ విషయం గురించి కపిల్‌ ‘పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలని భావించాను. కానీ నా వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని మా అమ్మ కోరిక. ఎందుకంటే నా సోదరుడు, సోదరి వివాహ సమయంలో మా ఆర్థిక పరిస్థితులు ఇప్పటిలా లేవు. దాంతో వారి వివాహాన్ని చాలా సింపుల్‌గా చేశాము. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో నా పెళ్లైనా ఘనంగా చేయాలని మా అమ్మ ముచ్చటపడుతోంది. ఆమె సంతోషం కోసం నేను కూడా ఇందుకు అంగీకరించాను’ అని తెలిపారు.

అంతేకాక ‘గిన్ని కూడా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారు కూడా తమ కుమార్తె వివాహాం గురించి ఎన్నో కలలు కన్నారు. వారి సంతోషాన్ని కాదనడం సరికాదనిపించింది. అందుకే నా వివాహ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది’ అని తెలిపారు. ఇన్ని రోజులు కపిల్‌ తాను తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన పంజాబీ చిత్రం ‘సన్నాఫ్‌ మన్‌జీత్‌ సింగ్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 12 విడుదలయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement