మనశ్శాంతి కోసం...! | Check out: Bipasha Basu takes a spiritual break | Sakshi
Sakshi News home page

మనశ్శాంతి కోసం...!

Published Mon, Feb 23 2015 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

మనశ్శాంతి కోసం...!

మనశ్శాంతి కోసం...!

వృత్తి మీద ఎంత ప్రేమ ఉన్నా.. విశ్రాంతి లేకుండా పని చేస్తే విసుగు చెందడం ఖాయం. మరి.. బిపాసా బసు అలానే విసిగిపోయారో ఏమో కానీ.. ఇటీవల హిమాలయాలకు వెళ్లారు. అక్కడి ‘ఆనందాశ్రమం’ అనే ఆధ్యాత్మిక కేంద్రంలో పదకొండు రోజులు గడిపారు. యోగా చేశారు. గంటలు గంటలు ధ్యానం చేశారు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి.. మనసుకి హాయినిస్తున్నాయనీ ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.

తెల్లటి దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని.. ఓ సాధ్విలా అగుపించారు బిపాసా. హిమాలయాల నుంచి తిరిగొచ్చేటప్పుడు.. తన మనసు ప్రశాంతంగా మారిపో యిందనీ, నూతనోత్తేజం పొందినట్లుగా అనిపించిందనీ బిపాసా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement