ఔను... మేమిద్దరం విడిపోయాం! | Bipasha Basu and John Abraham's break-up | Sakshi
Sakshi News home page

ఔను... మేమిద్దరం విడిపోయాం!

Published Wed, Dec 17 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

ఔను... మేమిద్దరం విడిపోయాం!

ఔను... మేమిద్దరం విడిపోయాం!

 జాన్ అబ్రహమ్‌తో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, అతడి నుంచి విడిపోయారు బిపాసా బసు. ఆ తర్వాత హీరో హర్మాన్ బవేజాతో ఆమె ప్రేమలో పడ్డారు. ‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆ మధ్య బిపాసా తన సన్నిహితులతో అన్నట్లు వార్త కూడా వచ్చింది. మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రేమికులు భార్యా, భర్తలవుతారనే ఊహాగానాలు ఉండగా, ‘మేమిద్దరం విడిపోయాం’ అని బిపాసా బహిరంగంగా ప్రకటించేశారు.
 
 ఎందుకు విడిపోయామనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. బిపాసా ఇంకా చెబుతూ -‘‘హర్మాన్ కుటుంబమంటే నాకు గౌరవం. అతనికీ మా ఫ్యామిలీ అంటే గౌరవం ఉంది. మేం విడిపోయినా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. హర్మాన్‌నుంచి ప్రియురాలిగానే విడిపోయా. అతనితో ఎప్పటికీ స్నేహంగా ఉంటాను’’ అన్నారు. ఇది ఇలా ఉండగా, నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌కి దగ్గర కావడం వల్లే హర్మాన్‌కి బిపాసా దూరమయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, బిపాసా ఆ వార్తలో నిజం లేదంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement