ఛీ.. ఛీ...సహజీవనమా? | Living in before shaadi? No, thanks, says Bipasha | Sakshi
Sakshi News home page

ఛీ.. ఛీ...సహజీవనమా?

Published Mon, Oct 6 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

ఛీ.. ఛీ...సహజీవనమా?

ఛీ.. ఛీ...సహజీవనమా?

 ఎవరి నోటి నుంచి ఎలాంటి మాట వినిపిస్తే.. ఆశ్చర్యం కలుగుతుందో ఇటీవల బిపాసా బసు అలాంటి మాటే అన్నారు. జాన్ అబ్రహాంతో ఆమె దాదాపు ఏడెనిమిదేళ్లు సహజీవనం చేసి, అనంతరం విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమాయణం సాగిస్తున్నారు. మీ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? అని ఎవరో అడిగితే.. ‘ఛీ.. ఛీ.. సహజీవ నమా? సమస్యే లేదు. కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యా, భర్తల మధ్య మంచి అవగాహన అవసరం.
 
 మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం సూపర్ సక్సెస్. నా మ్యారీడ్ లైఫ్ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే సహజీవనం జోలికి వెళ్లను’’ అని చెప్పారు బిపాసా బసు. ఓసారి సహజీవనం ఇచ్చిన చేదు అనుభవంవల్లే ఆమె ఇలా మాట్లాడి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. త్వరలో హర్మాన్ బవే జాతో మూడు ముళ్లు వేయించుకోవడానికి బిపాసా సిద్ధపడుతున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ జంట అనుకుంటోందని బాలీవుడ్ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement