Harman Baweja
-
రెండోసారి తండ్రైన ప్రముఖ నటుడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్మన్ బవేజా జంటకు అభినందనలు చెబుతున్నారు. డిసెంబరు 2022లోనే వీరిద్దరికి ఓ కుమారుడు జన్మించగా.. తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చారు.కాగా.. హర్మన్ బవేజా, సాషా రాంచందనీ 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే హర్మన్ బవేజా చివరిసారిగా స్కూప్లో కనిపించాడు. సన్యా మల్హోత్రాతో కలిసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌లో కనిపించనున్నారు. 2008లో లవ్ స్టోరీ 2050 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు హర్మన్. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. అంతే కాకుండా వాట్స్ యువర్ రాషీ, విక్టరీ, దిష్కియావూన్, ఇట్స్ మై లైఫ్ చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Rowena Baweja (@rowenabaweja) -
పెళ్లిపీటలెక్కిన బాలీవుడ్ నటుడు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఆరోగ్య నిపుణురాలు సాషా రామ్చందానిని పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పంజాబీ సంప్రదాయం ప్రకారం ఆదివారం వీరి పెళ్లి జరిగింది. పింక్ పేస్టల్ షేర్వాణీలో వరుడు హర్మన్ హుందాగా కనిపించగా, రెడ్ అండ్ పీచ్ లెహంగాలో సాషా మెరిసిపోయారు. ఇక ఇండస్ట్రీ నుంచి నటులు ఆమిర్ అలీ, ఆశిష్ చౌదరి, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా వివాహానికి హాజరయ్యారు. కాగా హర్మన్- సాషా వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొత్తజంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా డైరెక్టర్ హారీ బవేజా- నిర్మాత పమ్మీ బవేజా సంతానమైన హర్మన్ 2008లో లవ్‌స్టోరీ 2050 ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించారు. తర్వాతి చిత్రం వాట్స్ యువర్ రాశీలోనూ పిగ్గీచాప్స్తో జతకట్టడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. ఇక కొన్నాళ్లపాటు వెండితెరకు దూరమైన హర్మన్, రాజ్‌కుంద్రా- శిల్పాశెట్టి నిర్మాతలుగా వ్యవహరించిన దిష్కియాన్ సినిమాతో 2014లో ప్రేక్షకులను పలకరించాడు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raj Kundra (@rajkundra9) -
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు,హర్మాన్ బవేజా అభిమానులకు శుభవార్త! ‘లవ్ స్టోరీ 2050’ ఫేమ్ హర్మాన్ బవేజా త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడుతున్నాడు. న్యూట్రిషన్ హెల్త్ కోచ్ సాషా రామ్చందానితో ఏడడుగులు వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. రేపే (మార్చి 21 న) కోల్‌కతాలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారట. ఈనేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో ఈ జంట మునిగి తేలుతున్నారు. వివాహానికి ముందు జరిపే వేడుకల ప్రారంభానికి ముందు కాక్టెయిల్ పార్టీలో వీరు సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త , హర్మాన్ స్నేహితుడు రాజ్‌కుంద్రా హర్మాన్‌కు అభినందనలు తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో హర్మాన్ బవేజా నల్ల కుర్తా ధరించి, సాషాతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వైరల్‌గా మారాయి. ఈ జంట గత ఏడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుంది. హర్మాన్ సోదరి రోవేనా బవేజా సాషా రామ్చందానీని తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఒక పిక్ షేర్ చేయడంతో వీరి పెళ్లి వార్త ఫ్యాన్స్‌కు తెలిసింది. -
త్వరలో హిందీ బొమ్మరిల్లు హీరో పెళ్లి!
బొమ్మరిల్లు హిందీ రీమేక్ 'ఇట్స్ మై లైఫ్' హీరో హర్మన్ బవేజా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, ఫిట్నెస్ మాంత్రికురాలు సాషా రామ్చందానీని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో మార్చి 21న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. కోల్‌కతాలో జరగనున్న ఈ వేడుకకు తక్కువ మంది అతిథులనే ఆహ్వానిస్తారట. 50-70 మంది సమక్షంలోనే పెళ్లి తంతు పూర్తి కానిచ్చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. (చదవండి: దీపికా పదుకునే బ్యాగ్ కలెక్షన్) ఇక హర్మన్‌కు కాబోయే భార్య సాషా 'బెటర్ బ్యాలెన్స్డ్ సెల్ఫ్' పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీని రన్ చేస్తోంది. ఇందులో ఆమె హెల్తీ డైట్‌తోపాటు యోగా టిప్స్ చెప్తుంది. కాగా ప్రముఖ నిర్మాత హ్యారీ బవేజా కొడుకే హర్మన్. ఇతడు 2008లో 'లవ్ స్టోరీ 2050' చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోగా విమర్శలను మూటగట్టుకుంది. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని 'విక్టరీ' చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది మరోసారి ప్రియాంకతో కలిసి 'వాట్స్ యువర్ రాశి?' సినిమా చేశాడు. ఆయన చివరిసారిగా 2016లో 'చార్ సహిబ్జాదే: రైజ్ ఆఫ్ బందా సింగ్ బహదూర్' సినిమాలో కనిపించాడు. చాలా ఏళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ఆయన ప్రస్తుతం నిర్మాతగా పని చేస్తున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ ఫేం రొమాంటిక్ ఫోటో.. ఎవరతను?) -
అందుకే ఆమెతో బ్రేకప్ చేసుకున్నా!
ప్రేమలు పుట్టడం. బ్రేకప్ అవడం కొత్తేం కాదు. సెలబ్రెటీల్లో అయితే ఇది సాధారణం. ప్రేమలు పుడుతూనే ఉంటాయి. బ్రేకప్ అవుతూనే ఉంటాయి. ఎంతో మంది జంటలు ప్రేమించుకున్నారు. మళ్లీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ జాబితా కూడా చాలా పెద్దదే. అయితే బాలీవుడ్లో మాత్రం ఈ పోకడలు మరీ ఎక్కువ. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ ప్రేమకథ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. హాలీవుడ్‌కు ఎగిరిపోయి.. అక్కడ కూడా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంకచోప్రా. ప్రస్తుతం హాలీవుడ్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఆమె. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహారం చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి కూడా త్వరలో జరుగబోతోందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు ఇది తొలిప్రేమ కాదు. గతంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2008లో వచ్చిన ‘లవ్‌స్టోరి 2050’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన హర్మన్ బెవాజా, ప్రియాంక చోప్రాలు ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్ కూడా చేశారు. రెండేళ్లు తిరక్కుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పట్లో ఈ బ్రేకప్‌పై రకరకాల పుకార్లు వినిపించాయి. హర్మన్ కెరీర్ సరిగా లేదనే కారణం.. వరుసగా ప్లాఫ్ల్లో ఉండడంతోనే ఇద్దరికీ బ్రేకప్ అయిందని రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై హర్మన్ తాజాగా స్పందించాడు. తన సినిమాలు రెండు, మూడు వరుసగా ప్లాఫ్ కావడంతో.. ఆ తరువాత కెరీర్‌పైనే పూర్తిగా తాను దృష్టి పెట్టానని, దాంతో ఆ సమయంలో ప్రియాంకకు సరిగా టైమ్ కేటాయించలేదని, అందువల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగి.. బ్రేకప్ అయిందని వివరించాడు. అయినా.. విజయాలు అపజయాలు అనేవి సంబంధాలను చెడగొడతాయని తాను అనుకోవడం లేదంటూ గతంలో జరిగిన బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
హీరో కజిన్ 'వ్యక్తిగత' వీడియో లీకైంది!
బాలీవుడ్ హీరో హర్మాన్ బవేజా కజిన్ జానీ బవేజా వ్యక్తిగత వీడియో ఒకటి లీకై.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జానీ ప్రస్తుతం 'స్కాండల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక హాట్ సీన్ లీకైంది. బెడ్ మీద సహ నటిని ఘాటుగా ముద్దాడుతున్నట్టు ఉన్న 17 సెకన్ల వీడియో సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లో వైరల్ గా మారిపోయింది. చిత్ర యూనిట్‌కు తెలియకుండానే ఈ దృశ్యం లీకవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని జానీ బవేజా చెప్పాడు. 'ఈ దృశ్యాల్లో నేనే ఉన్నాను. ఇది ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇది (స్కాండల్) సినిమా దృశ్యం. ఇందులో నేను రిహార్సల్ చేస్తున్న దృశ్యం అది. ఇది చాలా వ్యక్తిగతమైన వీడియో' అని బవేజా వాపోయాడు. ఇలాంటి వీడియోను ఎలా లీక్ చేస్తారని అతడు ప్రశ్నిస్తున్నాడు. -
ఔను... మేమిద్దరం విడిపోయాం!
జాన్ అబ్రహమ్‌తో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, అతడి నుంచి విడిపోయారు బిపాసా బసు. ఆ తర్వాత హీరో హర్మాన్ బవేజాతో ఆమె ప్రేమలో పడ్డారు. ‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆ మధ్య బిపాసా తన సన్నిహితులతో అన్నట్లు వార్త కూడా వచ్చింది. మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రేమికులు భార్యా, భర్తలవుతారనే ఊహాగానాలు ఉండగా, ‘మేమిద్దరం విడిపోయాం’ అని బిపాసా బహిరంగంగా ప్రకటించేశారు. ఎందుకు విడిపోయామనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. బిపాసా ఇంకా చెబుతూ -‘‘హర్మాన్ కుటుంబమంటే నాకు గౌరవం. అతనికీ మా ఫ్యామిలీ అంటే గౌరవం ఉంది. మేం విడిపోయినా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. హర్మాన్నుంచి ప్రియురాలిగానే విడిపోయా. అతనితో ఎప్పటికీ స్నేహంగా ఉంటాను’’ అన్నారు. ఇది ఇలా ఉండగా, నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌కి దగ్గర కావడం వల్లే హర్మాన్కి బిపాసా దూరమయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, బిపాసా ఆ వార్తలో నిజం లేదంటున్నారు. -
ఛీ.. ఛీ...సహజీవనమా?
ఎవరి నోటి నుంచి ఎలాంటి మాట వినిపిస్తే.. ఆశ్చర్యం కలుగుతుందో ఇటీవల బిపాసా బసు అలాంటి మాటే అన్నారు. జాన్ అబ్రహాంతో ఆమె దాదాపు ఏడెనిమిదేళ్లు సహజీవనం చేసి, అనంతరం విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హర్మాన్ బవేజాతో బిపాసా ప్రేమాయణం సాగిస్తున్నారు. మీ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? అని ఎవరో అడిగితే.. ‘ఛీ.. ఛీ.. సహజీవ నమా? సమస్యే లేదు. కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. వివాహ బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యా, భర్తల మధ్య మంచి అవగాహన అవసరం. మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం సూపర్ సక్సెస్. నా మ్యారీడ్ లైఫ్ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే సహజీవనం జోలికి వెళ్లను’’ అని చెప్పారు బిపాసా బసు. ఓసారి సహజీవనం ఇచ్చిన చేదు అనుభవంవల్లే ఆమె ఇలా మాట్లాడి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. త్వరలో హర్మాన్ బవే జాతో మూడు ముళ్లు వేయించుకోవడానికి బిపాసా సిద్ధపడుతున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఈ జంట అనుకుంటోందని బాలీవుడ్ సమాచారం. -
మళ్లీ ప్రేమలో పడింది
బిపాసా బసు మళ్లీ ప్రేమలో పడిందా?... అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. జాన్ అబ్రహాంతో బిపాసా దాదాపు తొమ్మిదేళ్లు ఎఫైర్ సాగించిన విషయం తెలిసిందే. అతన్ని పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని బిపాసా అభిప్రాయం. కానీ, జాన్ అబ్రహాం ఇప్పుడప్పుడే పెళ్లికి సుముఖత చూపకపోవడంతో అతన్నుంచి విడిపోయింది బిపాసా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కొన్నాళ్లు ఒంటరిగా ఉండి, సోలో లైఫ్ బాగుందని చెప్పుకుంటూ వచ్చింది బిపాసా. కానీ, ఆ తర్వాత తోడొకరుండిన మహాభాగ్యము అనుకుందో ఏమో.. హర్మాన్ బవేజాకి మనసిచ్చేసింది. ఈ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నలుగురి దృష్టిలోనూ పడ్డారు. ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన ఓ పార్టీకి ఇద్దరూ జాయింట్‌గా హాజరయ్యారట. అలాగే, ఈ జనవరిలో తన బర్త్‌డేని హర్మాన్‌తో కలిసి గోవాలో జరుపుకుంది బిపాసా. అప్పుడు ఈత కొలనులో వీళ్లు చేసిన సందడి తాలూకు ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఇన్నాళ్టికి తనకు ‘మిస్టర్ రైట్’ దొరికాడనే భావనలో బిపాసా ఉందట. ఈ ముద్దుగుమ్మ తల్లి, సోదరీమణులకు కూడా హర్మాన్ అంటే మంచి అభిప్రాయం ఉందని, బిప్స్కి తగిన వరుడు అతనేనని కూడా ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ టాక్. అలాగే హర్మాన్ సోదరి, బిపాసా మధ్య కూడా మంచి అనుబంధం మొదలైందట. దాంతో వీరి ప్రేమకు పెద్దల అనుమతి కూడా లభించేసిందని, ఇక ఆ పెళ్లి ముచ్చట జరగడమే ఆలస్యం అని బాలీవుడ్ భోగట్టా.