![Harman Baweja To Marry Sasha Ramchandani On March 21 - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/18/Harman-Baweja_2.jpg.webp?itok=SFRetCPJ)
బొమ్మరిల్లు హిందీ రీమేక్ 'ఇట్స్ మై లైఫ్' హీరో హర్మన్ బవేజా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, ఫిట్‌నెస్ మాంత్రికురాలు సాషా రామ్‌చందానీని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో మార్చి 21న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. కోల్‌కతాలో జరగనున్న ఈ వేడుకకు తక్కువ మంది అతిథులనే ఆహ్వానిస్తారట. 50-70 మంది సమక్షంలోనే పెళ్లి తంతు పూర్తి కానిచ్చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. (చదవండి: దీపికా పదుకునే బ్యాగ్ కలెక్షన్)
ఇక హర్మన్‌కు కాబోయే భార్య సాషా 'బెటర్ బ్యాలెన్స్‌డ్ సెల్ఫ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని రన్ చేస్తోంది. ఇందులో ఆమె హెల్తీ డైట్‌తోపాటు యోగా టిప్స్ చెప్తుంది. కాగా ప్రముఖ నిర్మాత హ్యారీ బవేజా కొడుకే హర్మన్. ఇతడు 2008లో 'లవ్ స్టోరీ 2050' చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోగా విమర్శలను మూటగట్టుకుంది. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని 'విక్టరీ' చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది మరోసారి ప్రియాంకతో కలిసి 'వాట్స్ యువర్ రాశి?' సినిమా చేశాడు. ఆయన చివరిసారిగా 2016లో 'చార్ సహిబ్‌జాదే: రైజ్ ఆఫ్ బందా సింగ్ బహదూర్' సినిమాలో కనిపించాడు. చాలా ఏళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ఆయన ప్రస్తుతం నిర్మాతగా పని చేస్తున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ ఫేం రొమాంటిక్ ఫోటో.. ఎవరతను?)
Comments
Please login to add a commentAdd a comment