Sasha
-
త్వరలో హిందీ బొమ్మరిల్లు హీరో పెళ్లి!
బొమ్మరిల్లు హిందీ రీమేక్ 'ఇట్స్ మై లైఫ్' హీరో హర్మన్ బవేజా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, ఫిట్నెస్ మాంత్రికురాలు సాషా రామ్చందానీని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో మార్చి 21న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. కోల్‌కతాలో జరగనున్న ఈ వేడుకకు తక్కువ మంది అతిథులనే ఆహ్వానిస్తారట. 50-70 మంది సమక్షంలోనే పెళ్లి తంతు పూర్తి కానిచ్చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. (చదవండి: దీపికా పదుకునే బ్యాగ్ కలెక్షన్) ఇక హర్మన్‌కు కాబోయే భార్య సాషా 'బెటర్ బ్యాలెన్స్డ్ సెల్ఫ్' పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీని రన్ చేస్తోంది. ఇందులో ఆమె హెల్తీ డైట్‌తోపాటు యోగా టిప్స్ చెప్తుంది. కాగా ప్రముఖ నిర్మాత హ్యారీ బవేజా కొడుకే హర్మన్. ఇతడు 2008లో 'లవ్ స్టోరీ 2050' చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోగా విమర్శలను మూటగట్టుకుంది. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని 'విక్టరీ' చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది మరోసారి ప్రియాంకతో కలిసి 'వాట్స్ యువర్ రాశి?' సినిమా చేశాడు. ఆయన చివరిసారిగా 2016లో 'చార్ సహిబ్జాదే: రైజ్ ఆఫ్ బందా సింగ్ బహదూర్' సినిమాలో కనిపించాడు. చాలా ఏళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ఆయన ప్రస్తుతం నిర్మాతగా పని చేస్తున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ ఫేం రొమాంటిక్ ఫోటో.. ఎవరతను?) -
సల్మాన్ రష్దీ పుస్తకాన్ని కొన్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఇద్దరు కూతుళ్లు సాషా, మాలియాతో కలిసి శనివారం ఓ చిన్న పుస్తక దుకాణాన్ని సందర్శించారు. భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ రచించిన పుస్తకంతోపాటు తొమ్మిద పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. రష్దీ రచించిన 'టు ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ నైట్స్' పుస్తకాన్ని ఒబామా కొన్నారు. దాంతో పాటు జోనాథన్ ఫ్రాంజన్ రచించిన 'ప్యూరిటీ: ఏ నావెల్', సింథియా వొయిట్ రచించిన 'ఎల్స్కే: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', 'ఫార్చూన్స్ వీల్స్', 'జాకారో: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', నాటాలీ లాయిడ్ రాసిన 'ఏ స్నిక్కర్ ఆఫ్ మ్యాజిక్' తదితర పుస్తకాలను ఒబామా తీసుకున్నారు. ఓ చిన్న దుకాణంలో ఈ పుస్తకాలు కొన్న ఒబామా వాటిని ముదురు రంగు సంచిలో వేసుకొని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడ్డ జర్నలిస్టులను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత తన ఎస్‌యూవీలో బిడ్డలతో బయలుదేరారు. అనంతరం డీసీ సమీపంలో ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్ద ఆగి.. ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు. -
సాషా, మలియాలు రావట్లేదు
వాషింగ్టన్: భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల వెంట వారి కుమార్తెలు సాషా(16),మలియా(13) లు రావటం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రథమ కుమార్తెలిరువురూ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తారని, స్కూలుకు సెలవులు ఉన్నపుడు మాత్రమే తల్లిదండ్రులతో కలసి విదేశీ ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ గురువారం విలేకరులకు వెల్లడించారు. -
ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు భారత పర్యటనను మిస్సవుతున్నారు. ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా తన కుమార్తెలు 16 ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా ఇక్కడకు రావడం లేదని యూఎస్ డిప్యూటీ నెషనల్ సెక్యురిటీ అడ్వైజర్ బెన్ రోడ్స్ తెలిపారు. వీరి తొలి ప్రాధాన్యం స్కూల్ కావడం వల్ల తమ విదేశీ పర్యటనలను వేసవిలోనే చేయాలనుకుంటున్నారని రోడ్స్ అన్నారు. ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలు మాత్రమే ఈ పర్యటనకు రానున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగే గణతంత్ర్య వేడుకలకి ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వీరి మూడు రోజుల పర్యటనలో తాజ్ మహాల్ని కూడా సందర్శించనున్నారు. -
ఒబామా కుమార్తెలను వెంబడించిన కారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహ న శ్రేణిని ఓ కారు వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వైట్‌హౌస్ ప్రధాన ద్వారాలను కొద్దిసేపు తాత్కాలికంగా మూసివేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఒబామా కుమార్తెలు మాలియ, సాషా వస్తున్న వాహన శ్రేణిని ఓ కారు వెంబడిస్తూ.. వైట్ హౌస్‌లోకి ప్రవేశించేయత్నం చేసింది. దీంతో సంబంధిత కారును అడ్డుకుని.. డ్రైవర్‌ను భద్రతా దళాలు అదుపుతోకి తీసుకున్నాయి. అధికారులు కారును పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అందులో ఎటువంటి వస్తువులు దొరకలేదు. ఈ సమయంలో ఒబామా వైట్ హౌస్‌లోనే ఓ కీలక సమావేశంలో ఉండటంతో అధికారులు వైట్ హౌస్ ద్వారాలను తాత్కాలికంగా మూసేశారు. -
సీపీఎల్ చాంపియన్ ఇన్సోల్
జింఖానా, న్యూస్‌లైన్: కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) మూడో విడత టోర్నీలో ఇన్సోల్ జట్టు విజేతగా నిలిచింది. సాషా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇన్సోల్ 5 వికెట్ల తేడాతో డాక్టర్ రెడ్డీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన డాక్టర్ రెడ్డీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బ్రిజేష్ పటేల్ 45, రాజేష్ 24, మన్‌ప్రీత్ 21 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచారు. ఇన్సోల్ బౌలర్లు శ్రీకాంత్, ఉదయ్ చెరో మూడు వికెట్లు, రచనేష్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇన్సోల్ 5 వికె ట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దినేష్ (48 నాటౌట్), శ్రీకాంత్ (31) మెరుగ్గా ఆడారు. రెడ్డీస్ జట్టు బౌలర్ బ్రిజేష్ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రిజేష్ (డాక్టర్ రెడ్డీస్) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోగా.. బెస్ట్ బౌలర్‌గా రావిష్ (నిసూమ్ టెక్నాలజీస్), బ్యాట్స్‌మ న్గా రియాజ్ అలీ (వెర్నాక్యులస్) నిలిచారు.