ఒబామా కుమార్తెలను వెంబడించిన కారు | Car trailing Obama daughters' motorcade prompts White House lockdown | Sakshi
Sakshi News home page

ఒబామా కుమార్తెలను వెంబడించిన కారు

Published Thu, May 8 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

Car trailing Obama daughters' motorcade prompts White House lockdown

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహ న శ్రేణిని ఓ కారు వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వైట్‌హౌస్ ప్రధాన ద్వారాలను కొద్దిసేపు తాత్కాలికంగా మూసివేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఒబామా కుమార్తెలు మాలియ, సాషా వస్తున్న వాహన శ్రేణిని ఓ కారు వెంబడిస్తూ.. వైట్ హౌస్‌లోకి ప్రవేశించేయత్నం చేసింది. దీంతో సంబంధిత కారును అడ్డుకుని.. డ్రైవర్‌ను భద్రతా దళాలు అదుపుతోకి తీసుకున్నాయి. అధికారులు కారును పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అందులో ఎటువంటి వస్తువులు దొరకలేదు. ఈ సమయంలో ఒబామా వైట్ హౌస్‌లోనే ఓ కీలక సమావేశంలో ఉండటంతో అధికారులు వైట్ హౌస్ ద్వారాలను తాత్కాలికంగా మూసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement