Malia
-
కువైట్‌లో కడపవాసుల అరెస్టు కలకలం!
రాజంపేట : తెలంగాణలోని వరంగల్‌లో చిన్నారి అత్యాచారానికి స్పందించడమే వైఎస్సార్ జిల్లా వాసులకు శాపంగా మారింది. కువైట్ దేశంలోని మాలియాలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. మొత్తం 24 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఇందులో జిల్లాకు చెందిన వారు ఉండటంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన వారు అరెస్టైన వారిలో ఉండడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కువైట్ దేశంలో ఉంటూ అక్కడ చట్టాలు తెలియకపోవడం ప్రవాసాంధ్రులకు శాపంగా పరిణమించింది. తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో స్పందిస్తే అదే వారికి పెద్ద శాపమై కూర్చుంది. రాచరిక వ్యవస్థ ఉన్న కువైట్ సహా ఏ గల్ఫ్‌దేశంలోనైనా నిరసన సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్రనేరం. దీనికి జైలుశిక్ష పూర్తయినా తర్వాత వీసా రద్దు చేసి ఏ గల్ఫ్‌దేశంలోనూ అడుగుపెట్టకుండా జీవితకాలం నిషేధం విధిస్తారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ... తమవారు కువైట్‌లో అరెస్టు అయి ఉంటే విడుదల చేయించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రవాసాంధ్రులు విన్నవిస్తున్నారు. అరెస్టయిన వారిని కలిసేందుకు భారతీయ దౌత్యవర్గాలు రెండురోజులుగా ప్రయత్నిస్తున్నా, అక్కడి అధికారులు అనుమతించడం లేదని తెలిసింది. జిల్లాకు చెందిన ఎంపీలు వెంటనే స్పందించి తమ వారిని విడిపించాలని అరెస్టయిన సంబంధీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సల్మాన్ రష్దీ పుస్తకాన్ని కొన్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఇద్దరు కూతుళ్లు సాషా, మాలియాతో కలిసి శనివారం ఓ చిన్న పుస్తక దుకాణాన్ని సందర్శించారు. భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ రచించిన పుస్తకంతోపాటు తొమ్మిద పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. రష్దీ రచించిన 'టు ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ నైట్స్' పుస్తకాన్ని ఒబామా కొన్నారు. దాంతో పాటు జోనాథన్ ఫ్రాంజన్ రచించిన 'ప్యూరిటీ: ఏ నావెల్', సింథియా వొయిట్ రచించిన 'ఎల్స్కే: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', 'ఫార్చూన్స్ వీల్స్', 'జాకారో: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', నాటాలీ లాయిడ్ రాసిన 'ఏ స్నిక్కర్ ఆఫ్ మ్యాజిక్' తదితర పుస్తకాలను ఒబామా తీసుకున్నారు. ఓ చిన్న దుకాణంలో ఈ పుస్తకాలు కొన్న ఒబామా వాటిని ముదురు రంగు సంచిలో వేసుకొని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడ్డ జర్నలిస్టులను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత తన ఎస్‌యూవీలో బిడ్డలతో బయలుదేరారు. అనంతరం డీసీ సమీపంలో ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్ద ఆగి.. ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు. -
పార్ట్‌టైమ్ జాబ్‌లో ఒబామా కుమార్తె..!
లాస్ ఏంజెలిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా (17) పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరిందట. ఆమె హెచ్‌బీవో టీవీ చానల్లో ప్రసారమయ్యే ‘గర్ల్స్’ సిరీస్‌లో తాత్కాలిక ఉద్యోగంలో చేరిందని వార్తలు వచ్చాయి. మాలియా వచ్చే ఏడాది డిగ్రీ పూర్తయిన తర్వాత టీవీ లేదా సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటానని ఇదివరకే చెప్పింది. -
సాషా, మలియాలు రావట్లేదు
వాషింగ్టన్: భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల వెంట వారి కుమార్తెలు సాషా(16),మలియా(13) లు రావటం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రథమ కుమార్తెలిరువురూ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తారని, స్కూలుకు సెలవులు ఉన్నపుడు మాత్రమే తల్లిదండ్రులతో కలసి విదేశీ ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ గురువారం విలేకరులకు వెల్లడించారు. -
ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు భారత పర్యటనను మిస్సవుతున్నారు. ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా తన కుమార్తెలు 16 ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా ఇక్కడకు రావడం లేదని యూఎస్ డిప్యూటీ నెషనల్ సెక్యురిటీ అడ్వైజర్ బెన్ రోడ్స్ తెలిపారు. వీరి తొలి ప్రాధాన్యం స్కూల్ కావడం వల్ల తమ విదేశీ పర్యటనలను వేసవిలోనే చేయాలనుకుంటున్నారని రోడ్స్ అన్నారు. ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలు మాత్రమే ఈ పర్యటనకు రానున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగే గణతంత్ర్య వేడుకలకి ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వీరి మూడు రోజుల పర్యటనలో తాజ్ మహాల్ని కూడా సందర్శించనున్నారు. -
కూతురు గురించి బెంగపడుతున్న ఒబామా
వాషింగ్టన్ : కన్నబిడ్డ కాసేపు కనిపించకపోతేనే తల్లడిల్లుతాం. అదే ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డను కాస్త దూరంగా పంపాలంటే ఏ తండ్రి కళ్లయినా చెమ్మగిల్లుతాయి. దేశానికి రాజు అయినా... తండ్రి మమకారం విషయంలో మాత్రం అతడు మామూలు వ్యక్తే. ఇందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మినహాయింపు కాదు. ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి అధినేత అయిన ఒబామా తన పెద్ద కూతురు మాలియాను ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు పంపించే విషయమై ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. బిడ్డను విడిచి దూరంగా ఎలా ఉండాలా అని భావోద్వేగానికి లోనవుతున్నారు. 16 ఏండ్ల మాలియా ఇప్పుడు 11 గ్రేడ్ చదువుతోంది. మరికొన్ని నెలల తర్వాత ఆమె కాలేజీ చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లే అవకాశముంది. అయితే, ఆ సందర్భంలోని తీపిని, చేదును ఎదుర్కోవడానికి గత రెండేళ్లుగా తాను భావోద్వేగంగా సన్నద్ధమవుతున్నట్టు ఒబామా చెప్పారు. ఇటీవల మస్సాచుసెట్స్ హైస్కూల్ గ్రాడ్యుయెట్స్తో మాట్లాడిన ఆయన ‘ఆ సందర్భంలో భావోద్వేగానికి లోనవ్వకుండా, ఏడ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆమెను ఇబ్బందిపెట్టను. అది నా పరీక్షా సమయమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికే తండ్రి అంత ఎత్తు పెరిగిన మాలియా గతకొన్ని రోజులుగా స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నది. ఈ రెండు వర్సిటీలో ఒబామా కుటుంబం నివాసముంటున్న వైట్‌హౌస్‌కు చాలా దూరం. అన్నట్టు స్టాన్ఫోర్డ్ యూని వర్సిటీలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బిడ్డ చెల్సియా చదువుకుంది. -
ఒబామా కుమార్తెలను వెంబడించిన కారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహ న శ్రేణిని ఓ కారు వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వైట్‌హౌస్ ప్రధాన ద్వారాలను కొద్దిసేపు తాత్కాలికంగా మూసివేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఒబామా కుమార్తెలు మాలియ, సాషా వస్తున్న వాహన శ్రేణిని ఓ కారు వెంబడిస్తూ.. వైట్ హౌస్‌లోకి ప్రవేశించేయత్నం చేసింది. దీంతో సంబంధిత కారును అడ్డుకుని.. డ్రైవర్‌ను భద్రతా దళాలు అదుపుతోకి తీసుకున్నాయి. అధికారులు కారును పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అందులో ఎటువంటి వస్తువులు దొరకలేదు. ఈ సమయంలో ఒబామా వైట్ హౌస్‌లోనే ఓ కీలక సమావేశంలో ఉండటంతో అధికారులు వైట్ హౌస్ ద్వారాలను తాత్కాలికంగా మూసేశారు.