ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్ | Sasha, Malia not to accompany Obama on India visit | Sakshi
Sakshi News home page

ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్

Published Thu, Jan 22 2015 11:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్

ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్

 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు భారత పర్యటనను మిస్సవుతున్నారు. ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా తన కుమార్తెలు 16 ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా  ఇక్కడకు రావడం లేదని యూఎస్ డిప్యూటీ నెషనల్ సెక్యురిటీ అడ్వైజర్ బెన్ రోడ్స్ తెలిపారు.  వీరి తొలి ప్రాధాన్యం స్కూల్ కావడం వల్ల తమ విదేశీ పర్యటనలను వేసవిలోనే చేయాలనుకుంటున్నారని రోడ్స్ అన్నారు. 

 

ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలు మాత్రమే ఈ పర్యటనకు రానున్నారని  ఆయన తెలిపారు.  ఆదివారం ఢిల్లీలో జరిగే  గణతంత్ర్య వేడుకలకి ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  వీరి మూడు రోజుల పర్యటనలో తాజ్ మహాల్ని కూడా సందర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement