సల్మాన్ రష్దీ పుస్తకాన్ని కొన్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఇద్దరు కూతుళ్లు సాషా, మాలియాతో కలిసి శనివారం ఓ చిన్న పుస్తక దుకాణాన్ని సందర్శించారు. భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ రచించిన పుస్తకంతోపాటు తొమ్మిద పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. రష్దీ రచించిన 'టు ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ నైట్స్' పుస్తకాన్ని ఒబామా కొన్నారు.
దాంతో పాటు జోనాథన్ ఫ్రాంజన్ రచించిన 'ప్యూరిటీ: ఏ నావెల్', సింథియా వొయిట్ రచించిన 'ఎల్‌స్కే: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్‌డమ్', 'ఫార్చూన్స్ వీల్స్', 'జాకారో: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్‌డమ్', నాటాలీ లాయిడ్ రాసిన 'ఏ స్నిక్కర్ ఆఫ్ మ్యాజిక్' తదితర పుస్తకాలను ఒబామా తీసుకున్నారు. ఓ చిన్న దుకాణంలో ఈ పుస్తకాలు కొన్న ఒబామా వాటిని ముదురు రంగు సంచిలో వేసుకొని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడ్డ జర్నలిస్టులను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత తన ఎస్‌యూవీలో బిడ్డలతో బయలుదేరారు. అనంతరం డీసీ సమీపంలో ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్ద ఆగి.. ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు.