
ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్మన్ బవేజా జంటకు అభినందనలు చెబుతున్నారు. డిసెంబరు 2022లోనే వీరిద్దరికి ఓ కుమారుడు జన్మించగా.. తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చారు.
కాగా.. హర్మన్ బవేజా, సాషా రాంచందనీ 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే హర్మన్ బవేజా చివరిసారిగా స్కూప్‌లో కనిపించాడు. సన్యా మల్హోత్రాతో కలిసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌లో కనిపించనున్నారు. 2008లో లవ్ స్టోరీ 2050 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు హర్మన్. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. అంతే కాకుండా వాట్స్ యువర్ రాషీ, విక్టరీ, దిష్కియావూన్, ఇట్స్ మై లైఫ్ చిత్రాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment