Pre-Wedding Pics: Bollywood Actor Harman Baweja Marriage With Sasha Ramchandanis - Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్‌ నటుడు, పిక్స్‌ వైరల్‌ 

Published Sat, Mar 20 2021 12:58 PM | Last Updated on Sat, Mar 20 2021 6:44 PM

 Harman Baweja, Sasha Ramchandani's pre-wedding festivities begin - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటుడు,హర్మాన్ బవేజా అభిమానులకు శుభవార్త! ‘లవ్ స్టోరీ 2050’  ఫేమ్‌ హర్మాన్ బవేజా త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడుతున్నాడు.  న్యూట్రిషన్ హెల్త్ కోచ్ సాషా రామ్‌చందానితో  ఏడడుగులు వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు.  రేపే (మార్చి 21 న) కోల్‌కతాలో వీరిద్దరూ  మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారట. ఈనేపథ్యంలో ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో ఈ జంట మునిగి తేలుతున్నారు. వివాహానికి ముందు జరిపే వేడుకల ప్రారంభానికి ముందు కాక్టెయిల్ పార్టీలో వీరు సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త , హర్మాన్‌ స్నేహితుడు రాజ్కుం‌ద్రా హర్మాన్‌కు అభినందనలు తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో  హర్మాన్ బవేజా నల్ల కుర్తా ధరించి, సాషాతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ వైరల్‌గా మారాయి. ఈ జంట గత ఏడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. హర్మాన్ సోదరి రోవేనా బవేజా సాషా రామ్‌చందానీని తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఒక పిక్‌ షేర్‌ చేయడంతో వీరి పెళ్లి వార్త ఫ్యాన్స్‌కు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement