Actor Harman Baweja Ties Knot With Sasha Ramchandani, See Inside wedding Photos, Videos - Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కిన బాలీవుడ్‌ నటుడు

Mar 22 2021 6:34 PM | Updated on Mar 22 2021 7:41 PM

Actor Harman Baweja Tie Knot With Sasha Ramchandani - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు హర్మన్‌ బవేజా వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఆరోగ్య నిపుణురాలు సాషా రామ్‌చందానిని పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పంజాబీ సంప్రదాయం ప్రకారం ఆదివారం వీరి పెళ్లి జరిగింది. పింక్‌ పేస్టల్‌ షేర్వాణీలో వరుడు హర్మన్‌ హుందాగా కనిపించగా, రెడ్‌ అండ్‌ పీచ్‌ లెహంగాలో సాషా మెరిసిపోయారు. 

ఇక ఇండస్ట్రీ నుంచి నటులు ఆమిర్‌ అలీ, ఆశిష్‌ చౌదరి, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా వివాహానికి హాజరయ్యారు. కాగా హర్మన్‌- సాషా వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొత్తజంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా డైరెక్టర్‌ హారీ బవేజా- నిర్మాత పమ్మీ బవేజా సంతానమైన హర్మన్‌ 2008లో లవ్‌స్టోరీ 2050 ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించారు. తర్వాతి చిత్రం వాట్స్‌ యువర్‌ రాశీలోనూ పిగ్గీచాప్స్‌తో జతకట్టడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. ఇక కొన్నాళ్లపాటు వెండితెరకు దూరమైన హర్మన్‌,  రాజ్‌కుంద్రా- శిల్పాశెట్టి నిర్మాతలుగా వ్యవహరించిన దిష్కియాన్‌ సినిమాతో 2014లో ప్రేక్షకులను పలకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement