ప్రేమలు పుట్టడం. బ్రేకప్ అవడం కొత్తేం కాదు. సెలబ్రెటీల్లో అయితే ఇది సాధారణం. ప్రేమలు పుడుతూనే ఉంటాయి. బ్రేకప్ అవుతూనే ఉంటాయి. ఎంతో మంది జంటలు ప్రేమించుకున్నారు. మళ్లీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ జాబితా కూడా చాలా పెద్దదే. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఈ పోకడలు మరీ ఎక్కువ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ ప్రేమకథ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. హాలీవుడ్‌కు ఎగిరిపోయి.. అక్కడ కూడా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంకచోప్రా. ప్రస్తుతం హాలీవుడ్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఆమె. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహారం చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి కూడా త్వరలో జరుగబోతోందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు ఇది తొలిప్రేమ కాదు. గతంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది.
2008లో వచ్చిన ‘లవ్‌స్టోరి 2050’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన హర్మన్ బెవాజా, ప్రియాంక చోప్రాలు ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్ కూడా చేశారు. రెండేళ్లు తిరక్కుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పట్లో ఈ బ్రేకప్‌పై రకరకాల పుకార్లు వినిపించాయి. హర్మన్ కెరీర్ సరిగా లేదనే కారణం.. వరుసగా ప్లాఫ్‌ల్లో ఉండడంతోనే ఇద్దరికీ బ్రేకప్ అయిందని రూమర్స్ వినిపించాయి.
అయితే వీటిపై హర్మన్ తాజాగా స్పందించాడు. తన సినిమాలు రెండు, మూడు వరుసగా ప్లాఫ్ కావడంతో.. ఆ తరువాత కెరీర్‌పైనే పూర్తిగా తాను దృష్టి పెట్టానని, దాంతో ఆ సమయంలో ప్రియాంకకు సరిగా టైమ్ కేటాయించలేదని, అందువల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగి.. బ్రేకప్ అయిందని వివరించాడు. అయినా.. విజయాలు అపజయాలు అనేవి సంబంధాలను చెడగొడతాయని తాను అనుకోవడం లేదంటూ గతంలో జరిగిన బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment