
మళ్లీ ప్రేమలో పడింది
Published Tue, Oct 29 2013 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఈ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నలుగురి దృష్టిలోనూ పడ్డారు. ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన ఓ పార్టీకి ఇద్దరూ జాయింట్‌గా హాజరయ్యారట. అలాగే, ఈ జనవరిలో తన బర్త్‌డేని హర్మాన్‌తో కలిసి గోవాలో జరుపుకుంది బిపాసా. అప్పుడు ఈత కొలనులో వీళ్లు చేసిన సందడి తాలూకు ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఇన్నాళ్టికి తనకు ‘మిస్టర్ రైట్’ దొరికాడనే భావనలో బిపాసా ఉందట.
ఈ ముద్దుగుమ్మ తల్లి, సోదరీమణులకు కూడా హర్మాన్ అంటే మంచి అభిప్రాయం ఉందని, బిప్స్‌కి తగిన వరుడు అతనేనని కూడా ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ టాక్. అలాగే హర్మాన్ సోదరి, బిపాసా మధ్య కూడా మంచి అనుబంధం మొదలైందట. దాంతో వీరి ప్రేమకు పెద్దల అనుమతి కూడా లభించేసిందని, ఇక ఆ పెళ్లి ముచ్చట జరగడమే ఆలస్యం అని బాలీవుడ్ భోగట్టా.
Advertisement
Advertisement