కొంచెం తగ్గించండి డాడీ! | Daddy relax says abhishek bachchan | Sakshi
Sakshi News home page

కొంచెం తగ్గించండి డాడీ!

Published Mon, Aug 24 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

కొంచెం తగ్గించండి డాడీ!

కొంచెం తగ్గించండి డాడీ!

 ‘‘ఎంత చెప్పినా వినరేంటి? ఇకనైనా రిలాక్స్ కావొచ్చు కదా’’ అంటూ అమితాబ్ బచ్చన్‌ని ఆయన సతీమణి జయా బచ్చన్ ఈ మధ్య ఒత్తిడి చేస్తున్నారట. మరి.. ఏడు పదుల వయసులో కూడా కుర్రాడిలా రోజుకి ఎనిమిది, పది గంటలు షూటింగ్స్ చేస్తానంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది? జయా బచ్చన్‌కి మాత్రమే కాదు.. ఈ దంపతుల ముద్దుల తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ మధ్య తండ్రి ఆరోగ్యం గురించి తెగ పట్టించుకుంటున్నారట.
 
 ఫుల్ లెంగ్త్ రోల్స్, గెస్ట్ రోల్స్‌తో కలుపుకుని అమితాబ్ కనీసం ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడం, మరోవైపు యాడ్స్, టీవీ షోస్‌తో బిజీ బిజీగా ఉండటం అభిషేక్‌ని కలవరపెడుతోందట. ఇటీవల ‘మీ వర్క్‌లోడ్ కాస్త తగ్గించండి డాడీ’ అంటూ మారాం చేశాడట. తనయుడు అంతలా చెప్పినా అమితాబ్ మాత్రం పనిలోనే సుఖం ఉందంటున్నారట. దాంతో ఎలాగైనా అమితాబ్ వర్క్‌ని తగ్గించేయాలని జయా బచ్చన్, అభిషేక్ అనుకుంటు న్నారట. మరి.. సతీమణి, తనయుడి కోరిక మేరకు బిగ్ బి పని ఒత్తిడి తగ్గించుకుంటారా...? కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement