కొలరాడోకి వెకేషన్‌కి వచ్చిన జంట అక్కడ ఒక రిసార్ట్ వెలుపల హాట్ టబ్‌లో సేదతీరుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మౌంటైన్ లయన్ వారిపై దాడి చేసింది. ఈ అనూహ్య ఘటనకు ఆ జంట ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ జంతువుపై ఫ్లాష్ లైట్ వేసి, వేడినీళ్లు జల్లి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అది అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో విధలా ఆ జంట తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.
ఐతే ఈ ఘటనలో ఆమె భర్తకి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. వాస్తవానికి ఆరోజు మౌంటైన్ లయన్ ఆమె భర్త తల, చెవిపై దాడి చేస్తుండగా..గమనించిన అతడి భార్య వెంటనే దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ బయటపడగలిగారు. ఆ తర్వాత ఆ జంట చుట్టుపక్కల వాళ్లని, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ గాయాలను చూసిన అధికారులు సైతం మౌంటైన్ లయన్ పంజా దాడిలానే ఉందని నిర్థారించారు.
ఆ జంట ఆ సమయంలో సరైన విధంగానే స్పందించారని అన్నారు. ఐతే సాధారణంగా మౌంటైన్ లయన్‌లు సాధారణ వెలుగులో మనిషి తలను గుర్తుపట్టలేవని, అది కూడా హాట్ టబ్‌లో ఉండగా అస్సలు దాడి చేయలేవని చెబుతున్నారు వైల్డ్‌లైఫ్ మేనేజర్ సీన్ షెపర్డ్. ఈ మేరకు తాము ఆ సింహం గురించి హెచ్చరికలు జారీ చేయడమే గాక దాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటామని ఆ జంటకి భరోసా ఇచ్చారు. కాగా కొలరాడో ఇలాంటి మౌంటైన్ లయన్ దాడులు దాదాపు 24 జరిగాయని అన్నారు.
(చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment