Mountain Lion
-
ఎంజాయ్ చేద్దాం అనుకుంటే హడలిపోయేలా చేసింది..పాపం ఆ జంట..
కొలరాడోకి వెకేషన్‌కి వచ్చిన జంట అక్కడ ఒక రిసార్ట్ వెలుపల హాట్ టబ్‌లో సేదతీరుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మౌంటైన్ లయన్ వారిపై దాడి చేసింది. ఈ అనూహ్య ఘటనకు ఆ జంట ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ జంతువుపై ఫ్లాష్ లైట్ వేసి, వేడినీళ్లు జల్లి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అది అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో విధలా ఆ జంట తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఐతే ఈ ఘటనలో ఆమె భర్తకి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. వాస్తవానికి ఆరోజు మౌంటైన్ లయన్ ఆమె భర్త తల, చెవిపై దాడి చేస్తుండగా..గమనించిన అతడి భార్య వెంటనే దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ బయటపడగలిగారు. ఆ తర్వాత ఆ జంట చుట్టుపక్కల వాళ్లని, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ గాయాలను చూసిన అధికారులు సైతం మౌంటైన్ లయన్ పంజా దాడిలానే ఉందని నిర్థారించారు. ఆ జంట ఆ సమయంలో సరైన విధంగానే స్పందించారని అన్నారు. ఐతే సాధారణంగా మౌంటైన్ లయన్లు సాధారణ వెలుగులో మనిషి తలను గుర్తుపట్టలేవని, అది కూడా హాట్ టబ్‌లో ఉండగా అస్సలు దాడి చేయలేవని చెబుతున్నారు వైల్డ్‌లైఫ్ మేనేజర్ సీన్ షెపర్డ్. ఈ మేరకు తాము ఆ సింహం గురించి హెచ్చరికలు జారీ చేయడమే గాక దాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటామని ఆ జంటకి భరోసా ఇచ్చారు. కాగా కొలరాడో ఇలాంటి మౌంటైన్ లయన్ దాడులు దాదాపు 24 జరిగాయని అన్నారు. (చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..) -
శవం కూడా దక్కది అనుకున్నారు! కానీ..
వాషింగ్టన్: పాలబుగ్గల చిన్నారి.. స్నేహితులతో ఆటల్లో మునిగిపోయింది. సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడుతూ.. ఒక్కసారిగా చెట్టు చాటు నుంచి స్నేహితురాలిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. కానీ, ఊహించని సర్ప్రైజ్ ఆమెకు ఎదురైంది. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అదృష్టంకొద్దీ ప్రాణం మిగలడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. లిల్లీ క్రైజానివిస్కీ.. వయసు తొమ్మిదేళ్లు. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి బెడ్‌పై సగం చిధ్రమైన స్థితిలో పడి ఉంది. ఓ కౌగర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. మృత్యువు ముఖం నుంచి బయటపడింది. కౌగర్.. పిల్లి జాతికి చెందిన భారీ జంతువు.. మౌంటెన్ లయన్. బరువు 35 నుంచి 115 కేజీల మధ్య ఉంటుంది. ఇవి దాడి చేస్తే మనుషి బతకడం చాలా కష్టం. 1924 నుంచి వాషింగ్టన్ స్టేట్‌లో 20 మందిపై దాడులు చేశాయి ఇవి. దాడి చేస్తే రక్తమాంసాలు కూడా మిగల్చకుండా తినేస్తాయి. అలాంటి క్రూర జంతువు దాడిలో గాయపడి.. బతకడం లిల్లీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. లిల్లీ కుటుంబం వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్కు విహారయాత్రకు వెళ్లింది. అధికారులను హెచ్చరికలను ఆ కుటుంబాలు పట్టించుకోలేదు. పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించారు. అక్కడే స్నేహితులతో ఆడుకుంటున్న టైంలో.. ఆ చిన్నారిపై కౌగర్ దాడి చేసింది. ముఖంతో పాటు మొత్తం ఆ చిన్నారిని చీల్చి పడేసింది. నోట కరుకుకుని లాక్కుని పోయింది. ఆ హఠాత్ పరిణామంతో తోటి పిల్లలు గట్టి గట్టిగా అరిచారు. అంతా వచ్చి చూసేసరికి రక్తపు మరకలు తప్ప బిడ్డ కనిపించలేదు. అంతా కలిసి వెతకగా.. కొద్దిదూరంలో రక్తపు మడుగులో పడి ఉంది ఆ చిన్నారి దేహం. అధికారుల సాయంతో వెంటనే లిల్లీని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, శరీర పైభాగం దాడిలో ఘోరంగా దెబ్బతింది. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు ఆ కుటుంబానికి డబ్బు అవసరం పడింది. అందుకే ఆమె అంకుల్ గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరించారు. చిన్నారి పరిస్థితిని ఫొటోల ద్వారా చూసి చలించి.. విరాళాలు ధారల వెల్లువెత్తాయి. మొత్తానికి సోమవారం సర్జరీ జరిగింది. ఐసీయూ నుంచి, అంతకు మించి కోమా నుంచి లిల్లీ బయటకు వచ్చింది. కానీ, ఆమె మామూలుగా తిరగగలుతుందా? అనేది మాత్రం ఆరునెలలు గడిచాకే చెబుతాం అంటున్నారు వైద్యులు. -
ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్
పెంపుడు జంతువులు మానవుని దైనందిన జీవితంలో మంచి ఆత్మీయులుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందులోనూ కుక్కులకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదు. తన యజమాని కోసం ఏం చేసేందుకైన వెనుకాడవు. తమ ప్రాణం ఉన్నంతవరకు యజమాని ఇంటిని కాపాడుతాయి. అంతేకాదు తమ యజమానిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటాయి కూడా. అచ్చం అలానే ఇక్కడొక కుక్క ప్రమాదంలో చిక్కుకున్న తన యజమానిని రక్షంచేందుకు ఏం చేసిందో తెలుసా! కాలిపోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన రెండున్నరేళ్ల పెంపుడు కుక్క ఎవాతో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లింది. ఈ మేరకు ఆమె పర్వత ట్రెక్కింగ్ వెళ్లినపుడూ ఒక సింహం ఆమెపై దాడి చేస్తుంది. దీంతో ఆమె భయంతో తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. అది తన యజమానిని రక్షించేందుక తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి సింహంతో పోరాడి తన యజమానిని రక్షించింది. ఈ క్రమంలో ఎవా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఎవా ఆస్పుత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
అరుదైన పర్వత పులుల గుంపు ఇదే..!
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఎల్ డోరడో జాతీయ పార్కులో బుధవారం రాత్రి ఓ అరుదైన సన్నివేశం వెలుగుచూసింది. ఏకాంత జీవనాన్ని ఇష్టపడే ‘పర్వత పులులు’ గుంపుగా దర్శనమిచ్చాయి. కాన్పు అనంతరం ఏడాది కాగానే.. ఈ పులులు పిల్లల్ని సైతం వేటాడి తింటాయని అలాంటిది ఐదు పులులు ఒకే చోట చేరడం నమ్మలేకుండా ఉందని కాలిఫోర్నియా వైల్డ్‌లైఫ్ ప్రతినిధి పీటర్ టిరా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వేల కొలది వీడియోలు, ఫొటోలు వీక్షిస్తుంటామని ఇలాంటి సంఘటన ఎప్పుడూ కనపడలేదని అన్నారు. అయితే, టిరా వాదనతో జంతు శాస్త్రవేత్తలు ఏకీభవించ లేదు. ఆ ఐదు పులుల్లో ఒకటి పెద్దగా ఉందని, బహుశా అది తల్లి పులి కావొచ్చునని చెప్తున్నారు. సంయోగం సమయంలో పులులు జతగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ, ఇలా ఐదు పులులు గుంపుగా ఉంటడం అరుదైనా సన్నివేశమని వెల్లడించారు. పర్వత పులుల్లో సహనం తక్కువని, ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయని టిరా చెప్పుకొచ్చారు. పులుల స్థావరాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల సాయంతోనే అరుదైన ఫొటోలు చూడగలుగుతున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
చూసుకోకుండా బాత్రూంలోకి వెళ్లుంటే..!
కాలిఫోర్నియా : రాత్రివేళ ఓ ఇంట్లోకి ప్రవేశించిన పర్వత సింహం అక్కడి బాత్రూంలో చల్లగా నిద్రపోయింది. కొన్ని గంటలపాటు ఆ ఇంట్లో వారిని భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కాలిఫోర్నియాలోని టులోమ్నే కౌంటీ అనే ప్రాంతంలోని పర్వతాలనుంచి రాత్రివేళ ఓ సింహం దగ్గరలోని ఇంట్లోకి ప్రవేశించింది. కొద్దిసేపు ఇంట్లో కలియతిరిగింది. అక్కడి బాత్రూంలో చల్లగా ఉండటంతో అక్కడే నిద్రపోయింది. ఆ ఇంటి సభ్యుడొకరు పొద్దున్నే బాత్రూం దగ్గరకు వెళ్లాడు. బాత్రూంలోకి అడుగు పెడుతుండగా అక్కడ సింహం నిద్రపోయి ఉండటం చూశాడు. అంతే అతి గుండె ఝల్లుమంది. వెంటనే చప్పుడు చేయకుండా అక్కడినుంచి వెనక్కు వచ్చి మిగిలిన ఇంటి సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో వెంటనే వారు ‘‘ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్’’ అధికారులకు సమాచారమిచ్చారు. వైల్డ్‌లైఫ్ అధికారులు, పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడేసరికి సింహం నిద్రలేచింది. అక్కడినుంచి పారిపోవాలని చూసింది కానీ, కుదరలేదు. కొన్ని గంటల పాటు శ్రమించిన అధికారులు అతి కష్టం మీద దాన్ని బాత్రూం కిటికిలోంచి సురక్షితంగా బయటకు పంపగలిగారు. -
లయన్‌తో తల్లి ఫైటింగ్.. కొడుకు సేఫ్
కొలరాడో: బిడ్డను కనడంలోనే కాదు.. ఆ బిడ్డను కాపాడుకోవడంలో ఎప్పుడు ఒక మాతృమూర్తి ముందే ఉంటుంది. అందుకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. తమ బిడ్డను తిడితేనే తల్లి ఊరుకోదు.. అలాంటిది చంపాలని చూస్తే ఇక ఊరుకుంటుందా.. కొలరాడోలో తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించిన అడవి పులి(మౌంటెయిన్ లయన్) నుంచి ఓ మాతృమూర్తి తన బిడ్డను రక్షించుకుంది. దానితో పోరాడి బెదరగొట్టి తన కుమారుడిని విడిపించుకుంది. ఈ క్రమంలో ఆమె చేతులకు, కాళ్లకు ఒళ్లంతా గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. అయినా ఏ మాత్రం భయపడకుండా ఆ పులితో పోరాడింది. పోలీసులు చెప్పిన ప్రకారం కొలరాడోలోని ఓ ఇంట్లో ఏవో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. బయటకు వెళ్లి చూసేవరకు తన ఐదేళ్ల కుమారుడిపై ఓ మౌంటెయిన్ లయన్ దాడి చేసి అతడి ముఖంపై తన పంజా పెట్టి చూస్తోంది. ఏ మాత్రం ఆలస్యం చేయని ఆ తల్లి వెళ్లి దానితో పోరాడింది. దానిని కొట్టి పారిపోయేలాగా చేసింది. అనంతరం కొడుకుని ఆస్పత్రిలో చేర్చించగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ముఖానికి, చేతులకు, ఛాతీపైనా, మెడపైన ఆ బాలుడికి గాయాలయ్యాయి. సోదరుడితో ఆడుకుంటున్న సమయంలో ఈ లైన్ దాడి చేసింది. -
వారిని మౌంటెయిన్ లయన్ వణికిస్తోంది
న్యూయార్క్: శాన్ ప్రాన్సిస్కోలోని పర్వతారోహకులను మౌంటెయిన్ లయన్ తీవ్రంగా భయపెడుతోంది. చాలా ఏళ్ల తర్వాత అక్కడి పర్వతారోహకులకు సింహం కనిపిండచంతో వారంత వణికి పోతున్నారు. గత పది రోజుల్లోనే నాలుగు సందర్భాల్లో సింహం తారస పడినట్లు అక్కడి నలుగురు పర్వతారోహకులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం అది మగమృగరాజు అని తెలిసింది. జూన్ 30న ఒంటరిగా పర్వతంపై తచ్చాడుతున్న మగ సింహాన్ని తాము తొలిసారి చూసినట్లు ముగ్గురు వ్యక్తులు అధికారులకు తెలిపారు. దీంతోపాటు అక్కడ అమర్చిన ఓ కెమెరాలో కూడా ఆ సింహం కనిపించింది. కానీ, ఉన్నట్లుండి గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అటువైపుగా వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. అది ఎక్కడ ఉందో, ఏ క్షణం దాడి చేస్తుందోనన్న గుబులు కూడా అధికారులను వేధిస్తోంది. అసలు, అంత ఎత్తు ఉన్న పర్వతంపైకి సింహం ఎలా వచ్చిందో అనేది ఇప్పటికీ వారికి అర్థం కానీ విషయం. అధికారుల అంచనా ప్రకారం ఆ సింహం శాన్ ప్రాన్సిస్కోలోని దక్షిణ భాగం వైపుగా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానిని బందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. -
'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'
న్యూయార్క్: సాధారణంగా కుక్కను చూస్తేనే పిల్లి అమాంతం లగెత్తుతుంది. అలాంటిది ఇక సింహాన్ని చూస్తే పరిస్థితి ఏంటి. అది కూడా కళ్లలోకి కళ్లుపెట్టి పంజా విసురుతున్నా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా కనీసం పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. అమెరికాలోని ఓ ఇంట్లో పిల్లి ఇలాగే చేసింది. ఓ ఇంటి యజమానులు తమ ఇంట్లో రెండు పిల్లులను పెంచుకుంటున్నారు. ఆ ఇల్లు ఓ అటవీ, కొండ ప్రాంతం మధ్యలో ఉండటంతో అప్పుడప్పుడు క్రూరమృగాల చప్పుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ రోజు పిల్లి నివాసం ఉంటున్న ఆ ఇంటి గుమ్మం వద్దకు ఓ సింహం వచ్చింది. గుమ్మం అవతల సింహం.. గుమ్మం ఇవతలిపక్క పిల్లి. ఆ సింహాన్ని చూసి అది పరుగెత్తిందా అంటే అదేం జరగలేదు. ఏంచక్కా దానిని ఓ సాధారణ జంతువులా చూసింది. అది గాండ్రుగాండ్రుమంటున్నా చెవులు వినిపించనట్లు.. పంజావిసురుతున్న పట్టనట్లు దానివైపే చూసింది. ఈ చర్యను చూసిన సింహం.. చిరాకుతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయింది. మరికాసింత దూరం వెళ్లి ఆ గుమ్మంలో ఉన్న పిల్లివైపు చూసి.. లాభం లేకపోవడంతో ఇక చేసేది మళ్లీ అడవి బాట పట్టింది. ఈలోపు మరోపిల్లి వచ్చి ఏం జరిగింది అన్నట్లుగా డేర్‌గా ఉన్న పిల్లితో ముచ్చటించడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ పిల్లిని సింహం ఎందుకు ఏం చేయలేకపోయిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ గుమ్మానికి అద్దంతో చేసిన తలుపులు బిగించి ఉన్నాయి. అందుకే సింహం గుమ్మం దాటి రాలేకపోయింది. పిల్లి దర్జాగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోను మాబెల్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టగా షికారు చేస్తోంది.