![Dog Fights Off Mountain Lion To Save Owner - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/21/california.jpg.webp?itok=vJQDVUzz)
పెంపుడు జంతువులు మానవుని దైనందిన జీవితంలో మంచి ఆత్మీయులుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందులోనూ కుక్కులకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదు. తన యజమాని కోసం ఏం చేసేందుకైన వెనుకాడవు. తమ ప్రాణం ఉన్నంతవరకు యజమాని ఇంటిని కాపాడుతాయి. అంతేకాదు తమ యజమానిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటాయి కూడా. అచ్చం అలానే ఇక్కడొక కుక్క ప్రమాదంలో చిక్కుకున్న తన యజమానిని రక్షంచేందుకు ఏం చేసిందో తెలుసా!
కాలిపోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన రెండున్నరేళ్ల పెంపుడు కుక్క ఎవాతో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లింది. ఈ మేరకు ఆమె పర్వత ట్రెక్కింగ్ వెళ్లినపుడూ ఒక సింహం ఆమెపై దాడి చేస్తుంది. దీంతో ఆమె భయంతో తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. అది తన యజమానిని రక్షించేందుక తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి సింహంతో పోరాడి తన యజమానిని రక్షించింది. ఈ క్రమంలో ఎవా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఎవా ఆస్పుత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment