లయన్తో తల్లి ఫైటింగ్.. కొడుకు సేఫ్ | Colorado Mother Fights Off Mountain Lion That Attacked Her 5-Year-Old Son | Sakshi
Sakshi News home page

లయన్తో తల్లి ఫైటింగ్.. కొడుకు సేఫ్

Published Sun, Jun 19 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

లయన్తో తల్లి ఫైటింగ్.. కొడుకు సేఫ్

లయన్తో తల్లి ఫైటింగ్.. కొడుకు సేఫ్

కొలరాడో: బిడ్డను కనడంలోనే కాదు.. ఆ బిడ్డను కాపాడుకోవడంలో ఎప్పుడు ఒక మాతృమూర్తి ముందే ఉంటుంది. అందుకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. తమ బిడ్డను తిడితేనే తల్లి ఊరుకోదు.. అలాంటిది చంపాలని చూస్తే ఇక ఊరుకుంటుందా.. కొలరాడోలో తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించిన అడవి పులి(మౌంటెయిన్ లయన్) నుంచి ఓ మాతృమూర్తి తన బిడ్డను రక్షించుకుంది. దానితో పోరాడి బెదరగొట్టి తన కుమారుడిని విడిపించుకుంది.

ఈ క్రమంలో ఆమె చేతులకు, కాళ్లకు ఒళ్లంతా గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. అయినా ఏ మాత్రం భయపడకుండా ఆ పులితో పోరాడింది. పోలీసులు చెప్పిన ప్రకారం కొలరాడోలోని ఓ ఇంట్లో ఏవో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. బయటకు వెళ్లి చూసేవరకు తన ఐదేళ్ల కుమారుడిపై ఓ మౌంటెయిన్ లయన్ దాడి చేసి అతడి ముఖంపై తన పంజా పెట్టి చూస్తోంది. ఏ మాత్రం ఆలస్యం చేయని ఆ తల్లి వెళ్లి దానితో పోరాడింది. దానిని కొట్టి పారిపోయేలాగా చేసింది. అనంతరం కొడుకుని ఆస్పత్రిలో చేర్చించగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ముఖానికి, చేతులకు, ఛాతీపైనా, మెడపైన ఆ బాలుడికి గాయాలయ్యాయి. సోదరుడితో ఆడుకుంటున్న సమయంలో ఈ లైన్ దాడి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement