'ఓ సింహమా.. ఇది నా ఇల్లు' | This is My House. Brave Cat Faces Down Mountain Lion, Fur Real | Sakshi
Sakshi News home page

'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'

Published Wed, Jun 24 2015 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'

'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'

న్యూయార్క్: సాధారణంగా కుక్కను చూస్తేనే పిల్లి అమాంతం లగెత్తుతుంది. అలాంటిది ఇక సింహాన్ని చూస్తే పరిస్థితి ఏంటి. అది కూడా కళ్లలోకి కళ్లుపెట్టి పంజా విసురుతున్నా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా కనీసం పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. అమెరికాలోని ఓ ఇంట్లో పిల్లి ఇలాగే చేసింది. ఓ ఇంటి యజమానులు తమ ఇంట్లో రెండు పిల్లులను పెంచుకుంటున్నారు. ఆ ఇల్లు ఓ అటవీ, కొండ ప్రాంతం మధ్యలో ఉండటంతో అప్పుడప్పుడు క్రూరమృగాల చప్పుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.  ఓ రోజు పిల్లి నివాసం ఉంటున్న ఆ ఇంటి గుమ్మం వద్దకు ఓ సింహం వచ్చింది.

గుమ్మం అవతల సింహం.. గుమ్మం ఇవతలిపక్క పిల్లి. ఆ సింహాన్ని చూసి అది పరుగెత్తిందా అంటే అదేం జరగలేదు. ఏంచక్కా దానిని ఓ సాధారణ జంతువులా చూసింది. అది గాండ్రుగాండ్రుమంటున్నా చెవులు వినిపించనట్లు.. పంజావిసురుతున్న పట్టనట్లు దానివైపే చూసింది.  ఈ చర్యను చూసిన సింహం.. చిరాకుతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయింది. మరికాసింత దూరం వెళ్లి ఆ గుమ్మంలో ఉన్న పిల్లివైపు చూసి.. లాభం లేకపోవడంతో ఇక చేసేది మళ్లీ అడవి బాట పట్టింది. ఈలోపు మరోపిల్లి వచ్చి ఏం జరిగింది అన్నట్లుగా డేర్గా ఉన్న పిల్లితో ముచ్చటించడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ పిల్లిని సింహం ఎందుకు ఏం చేయలేకపోయిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ గుమ్మానికి అద్దంతో చేసిన తలుపులు బిగించి ఉన్నాయి. అందుకే సింహం గుమ్మం దాటి రాలేకపోయింది. పిల్లి దర్జాగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోను మాబెల్ అనే వ్యక్తి యూట్యూబ్లో పెట్టగా షికారు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement